నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఇందులో శ్రుతీ హాసన్ కథానాయిక. రెండో కథానాయికగా హానీ రోజ్ ఎంపిక అయ్యారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలకు తోడు మరో కథానాయిక కూడా సినిమాలో సందడి చేయనున్నారు. అయితే, ఒక్క పాటలో మాత్రమే.


NBK 107 Special Song: బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంది. అందులో 'ఖిలాడి' బ్యూటీ డింపుల్ హయతి స్టెప్పులు వేయనున్నారని ప్రచారం జరిగింది. అయితే, అందులో నిజం లేదు. బాలకృష్ణ సినిమాలో డింపుల్ సాంగ్ చేయడం లేదు. ఆ అవకాశం ఆమెకు రాలేదు. మరి ఎవరు చేస్తున్నారు? అంటే... చంద్రికా  రవి.


భారతీయ మూలాలు ఉన్న ఆస్ట్రేలియా అమ్మాయి చంద్రికా రవి. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. మోడలింగ్ చేస్తూ... సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. తెలుగులో 'చీకటి గదిలో చితకొట్టుడు' సినిమా చేశారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం అందుకున్నారు. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సాంగ్ షూటింగ్ చేస్తున్నారని సమాచారం.


Also Read: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ


మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.


Also Read: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై