కరోనా తర్వాత భారీ విజయాలు సాధించిన సినిమాలు ఉన్నాయి. మంచి వసూళ్లు సాధించిన సినిమాలు ఉన్నాయి. అయితే, కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు వచ్చిన సినిమాలు మాత్రం కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో 'ఎఫ్ 3' (F3 Movie) సినిమా ఒకటి. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రమిది. చిత్ర సమర్పకులు 'దిల్' రాజు, నిర్మాత శిరీష్‌కు మంచి లాభాలు వచ్చాయని ఫిల్మ్ నగర్ టాక్.


థియేట్రికల్ వసూళ్లను పక్కన పెడితే... ఓటీటీ వేదిక నుంచి 'ఎఫ్ 3'కి మంచి ఆఫర్ వచ్చింది. యూనిట్ దానికి నో చెప్పిందని తెలుస్తోంది. సోనీ లివ్ ఓటీటీలో 'ఎఫ్ 3' స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే. సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీలో విడుదల చేస్తామని నిర్మాత 'దిల్' రాజు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మే 27న సినిమా విడుదలైంది. అంటే... జూలై నెలాఖరులో లేదంటే ఆగస్టు తొలి వారంలో ఓటీటీలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.
 
ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ముందు ఓటీటీలో విడుదల చేస్తే 12 కోట్ల రూపాయలు ఇస్తామని సోనీ లివ్ ఆఫర్ చేసిందట. దానికి సున్నితంగా 'ఎఫ్ 3' టీమ్ రిజెక్ట్ చేసిందని, రెండు నెలల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని దిల్ రాజు అండ్ కో డిసైడ్ అయ్యారట. 


Also Read: 'ఐ లవ్ యు' చెప్పినప్పుడు లేని ఇబ్బంది పెళ్లి అంటే ఎందుకు వచ్చింది సోనాక్షీ?


వెంకటేష్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ కౌర్, కీలక పాత్రలో మరో కథానాయికగా సోనాల్ చౌహన్... ఇతర ప్రధాన పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, సునీల్, ఆలీ, ప్రగతి, రఘుబాబు తదితరులు నటించిన 'ఎఫ్ 3'లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రత్యేక గీతం చేశారు.


Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ