Karisma Kapoor About ex-husband Sunjay Kapur: బాలీవుడ్ లో కపూర్ కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు హిందీ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. అదే ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కరిష్మా కపూర్. 1991లో నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, పలువురు అగ్రతారలతో కలిసి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'మర్డర్‌ ముబారక్‌' అనే వెబ్‌ సిరీస్‌ లో నటిస్తోంది. త్వరలో నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా సందడి చేయనుంది.

    


డబ్బు కోసం పశువులా ప్రవర్తించేవాడు!


కరిష్మా కపూర్ సినిమాల కంటే, భర్తతో గొడవల కారణంగా బాగా పాపులర్ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మరోసారి అతడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. పెళ్లికి ముందుకు పలు ప్రేమ వ్యవహారాలు నడిపిన కరిష్మా కపూర్‌ 2003లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్‌ ని పెళ్లి చేసుకుంది. వీరికి సమీరా, కిరణ్‌ అనే పిల్లలున్నారు. కొంతకాలం బాగానే కలిసి ఉన్నా, ఆ తర్వాత వీరిద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి. 2016లో వీరిద్దరు విడిపోయారు. అయితే, తన భర్త పశువు కంటే దారుణంగా ప్రవర్తించే వాడని కరిష్మా వెల్లడించింది. డబ్బు కోసం తనను ఎదుటివారితో పడుకోబెట్టేందుకు కూడా వెనుకాడని నీచుడని చెప్పింది. ఇలాంటి నీచమైన పనులు చేయనని ముఖం మీదే చెప్పినట్లు వెల్లడించింది. పెళ్లి తర్వాత కూడా ఆయన తన మాజీ భార్యతో ఎఫైర్ కొనసాగించాడని చెప్పింది. అవన్నీ భరించలేకే విడాకులు తీసుకున్నట్లు వివరించింది.  


హనీమూన్‌లో వేధింపులు!


అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కరిష్మా.. భర్తతో కలిసి హనీమూన్ కు వెళ్లినప్పటి నుంచే తనకు వేధింపులు మొదలయ్యాయాని వివరించింది. తన స్నేహితులతో రాత్రంతా గడపాలని ఒత్తిడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను వేలానికి పెట్టి అమ్మేయాలని చూశాడని కంటతడి పెట్టుకుంది. తన తల్లితో కూడా కొట్టించాలని చూశాడని చెప్పింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి.


ఇక కరిష్మా తన కెరీర్ లో ఎన్నో అద్భుత సినిమాల్లో నటించింది. ‘రాజా హిందుస్తానీ’, ‘దిల్ తో పాగల్ హై’ సినిమాలు అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించాయి. అంతేకాదు, ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డు,  జాతీయ చలనచిత్ర పురస్కారం, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును అందుకుంది. కరీష్మా కపూర్ ప్రస్తుతం ‘మర్డర్ ముబారక్‌’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. త్వరలో ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రసారం కానుంది.






Read Also: అనంత్ అంబానీకి బాలీవుడ్ స్టార్స్ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే - కళ్లు తిరుగుతాయ్ జాగ్రత్త!