Bollywood stars gifts to Anant Ambani and Radhika Merchant: రిలయన్స్ అధినేత ముఖేష్ అబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుజరాత్‌ లోని జామ్‌ నగర్‌ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ దిగ్గజనాలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. రిహన్నా షో నుంచి బాలీవుడ్ స్టార్స్ ఆటా పాటలకు వరకు అతిథులను అద్భుతంగా అలరించాయి. సుమారు రూ.1000 కోట్ల ఖర్చుతో ఈ వేడుకలను ముఖేష్ అంబానీ ఈ వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు.

  


కొత్త జంటకు బాలీవుడ్ స్టార్స్ ఖరీదైన బహుమతులు


ఇక ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్న బాలీవుడ్ నటీనటులు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంటకు అదిరిపోయే బహుమతులను అందించి సర్ ప్రైజ్ చేశారు. తమ రేంజికి తగినట్లుగా చక్కటి గిఫ్టులను అందజేశారు. ఇంతకీ ఏ బాలీవుడ్ స్టార్, ఏ బహుమతి అందించారో? దాని విలువెంతో? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


రణవీర్- దీపిక పదుకొణె   


బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ వీర్ సింగ్, దీపికా పదుకొణె, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కోసం సుమారు రూ.1 కోటి విలువైన వాచీలను బహుమతిగా అందించారు. ఈ వాచీలను ప్రత్యేకంగా తయారు చేసినట్లు సమాచారం. 


సల్మాన్ ఖాన్  


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా అనంత్ అంబానీ దంపతులకు చక్కటి గిఫ్టులు అందించారు. అనంత్‌కు ప్రత్యేకంగా తయారు చేయించిన ‘కస్టమైజ్డ్ వాచ్’ని బహుకరించారు. అంబానీ ఫ్యామిలీ చిన్న కోడలు రాధిక మర్చంట్‌‌కు సల్మాన్ చక్కటి డైమండ్ చెవిపోగులు గిఫ్టుగా ఇచ్చారు.  


షారుఖ్ ఖాన్


బాలీవుడ్ దిగ్గజ నటుడు షారుఖ్ ఖాన్ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ జంటకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. లేటెస్ట్ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ కారును అందించారు. దీని ఖరీదు రూ.5 కోట్లు ఉంటుందని సమాచారం.


కియారా అద్వానీ, కత్రినా కైఫ్


ఇక ఇషా అంబానీ చిన్ననాటి స్నేహితురాలు కియారా.. అనంత్, రాధికా దంపతులకు మర్చిపోలేని బహుమతి అందించింది. వజ్రాలు పొదిగిన బంగారు లక్ష్మీ గణేష్ విగ్రహాల సెట్‌ను అందించింది. అటు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులకు అనంత్-రాధిక దంపతులకు అద్భుతమైన డైమండ్ నెక్లెస్ తో పాటు బ్రాస్లెట్  బహుమతిగా ఇచ్చారు.


జూలై 12వ అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ వివాహం


అటు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ను జూలై 12న వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలను తలదన్నే రీతిలో వెడ్డింగ్ వేడుకలు జరపాలని ముఖేష్ భావిస్తున్నారట. అయితే, ఈ వేడుకలు జామ్ నగర్ లోనే నిర్వహిస్తారా? లేదంటే మరో ప్రాంతాన్ని సెలక్ట్ చేసుకున్నారా? అనే విషయం త్వరలో తెలియనుంది.


Read Also: ‘హనుమాన్‘ to 'భ్రమయుగం' - ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న రెండు డజన్ల సినిమాలు