Shine Tom Chacko In Nandamuri Balakrishna Bobby Kolli Movie: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందుతున్న కొత్త సినిమాలో మలయాళీ నటుడు కీలక పాత్ర చేస్తున్నట్లు తెలిసింది. న్యాచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాలో నటించిన షైన్ టామ్ చాకోను ఓ కీలక పాత్రకు ఎంపిక చేశారట. పూర్తి వివరాల్లోకి వెళితే... 


ఆల్రెడీ దుల్కర్ సల్మాన్....
ఇప్పుడు షైన్ టామ్ చాకో!
బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఇందులో మలయాళ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు 'మహానటి'తో పరిచయమైన దుల్కర్ సల్మాన్ ఓ పాత్ర చేస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ షైన్ టామ్ చాకో (Shine Tom Chacko In NBK 109)ను కూడా సెలెక్ట్ చేశారు. ఆయనది విలన్ టైపు రోల్ అని టాక్.


నాని 'దసరా'లో షైన్ టామ్ చాకో విలనిజానికి తెలుగునాట గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నాగశౌర్య 'రంగబలి' సినిమాలోనూ ఆయన విలన్‌ రోల్‌ చేశారు. బాలకృష్ణ సినిమా తెలుగులో విలన్‌గా ఆయనకు హ్యాట్రిక్‌ ఫిల్మ్‌ అనుకోవచ్చు.





 
బాబీ డియోల్... గౌతమ్ మీనన్!
బాలకృష్ణ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్న స్టార్ ఆర్టిస్ట్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంతకు ముందు ఈ సినిమాలో కీలక పాత్రకు బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఎంపికయ్యారు. 'యానిమల్' సినిమాతో ఆయనకు హిందీలో ఏ స్థాయి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాబీ డియోల్ చేరికతో హిందీ ప్రేక్షకుల చూపు సైతం సినిమాపై పడింది. తమిళ దర్శకుడు, నటుడిగా ఇటీవల వరుస సినిమాలు చేస్తున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో కీలక పాత్ర చేస్తున్నారు.


బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్ ఎవరు?
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. ఇందులో బాలకృష్ణ సరసన నటించే హీరోయిన్ ఎవరు? అనేది దర్శక నిర్మాతలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.


Also Read: జగపతి బాబుకు సల్మాన్‌తో ఫ్లాప్... బావమరిదితో లెక్క సెటిల్ చేయాల్సిన టైమ్!






'వాల్తేరు వీరయ్య' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి రౌటేలాను ఓ పాత్రకు ఎంపిక చేశారట బాబీ. త్రిష, మీనాక్షీ చౌదరి పేర్లు సైతం వినబడుతున్నాయి. మరి, చివరకు ఎవరు ఎంపిక అవుతారో చూడాలి. తెలుగమ్మాయి చాందిని చౌదరి అయితే దుల్కర్ సల్మాన్ జోడీగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల సినిమా టీజర్ విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభించింది.


Also Readయాదాద్రి టెంపుల్‌లో షణ్ముఖ్ పూజలు - కేసులు గట్రా నుంచి బయట పడేందుకు!?