Vishwak Sen about Gaami: ప్రేక్షకులు వైవిధ్యభరితమైన కథలను, కథనాలకు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారని అంటుంటారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు.. ఏ భాష సినిమా అయినా అందులో కంటెంట్ ఉంటే కచ్చితంగా దానిని సూపర్ హిట్ చేస్తారని ఎందరో మేకర్స్ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు.. తెలుగు సినిమాలను పక్కన పెట్టి మరీ ఇతర భాషా చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా తెలుగు మేకర్స్ సైతం ఇతర భాషా చిత్రాలపైనే ఫోకస్ పెడుతున్నారని యంగ్ హీరో విశ్వక్ సేన్ అన్న మాటలు తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.


ఆరేళ్లు కేటాయించాం..


విశ్వక్ సేన్.. ఎప్పుడూ తనకు నచ్చిందే మాట్లాడుతుంటాడు. దాని వల్ల కాంట్రవర్సీలు క్రియేట్ అయినా తను పెద్దగా పట్టించుకోడు. తాజాగా తన మూవీ ‘గామి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విశ్వక్.. తెలుగు మేకర్స్‌పై వ్యాఖ్యలు చేశాడు. ‘‘మేము ఒక మామూలు కమర్షియల్ సినిమా చేసుండొచ్చు. కానీ అలా కాదని, తెలుగు సినిమాకు ఒక కొత్తదనాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో గామి కోసం ఆరేళ్లు సమయం కేటాయించాం. మీరు సినిమాను సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. కానీ దానిని చంపడానికి మాత్రం మార్గాలు వెతకొద్దు’’ అంటూ ‘గామి’పై వస్తున్న నెగిటివ్ రివ్యూలపై స్పందించాడు విశ్వక్ సేన్. ఈ మూవీకి ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ వస్తున్న విషయం తెలిసిందే.


అందులో రాకెట్ సైన్స్ ఏం లేదు..


‘‘నేను కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తాను. కమర్షియల్ సినిమాలను కూడా చేస్తాను. మీరు గామి చూడకపోయింటే తప్పకుండా చూడండి. టాలీవుడ్‌లోని పెద్దవారు మా సినిమా చూసి దాని గురించి కూడా ఏమైనా చెప్తే బాగుంటుంది. ఇది మన తెలుగు సినిమా. నాకు తెలిసినంత వరకు టాలీవుడ్‌లో గామి లాంటి చిత్రం ఇప్పటివరకు రాలేదు. రెండు దశాబ్దాల తర్వాత కూడా ప్రేక్షకులు గామి గురించి మాట్లాడుకుంటారు. అదే డ్యూన్ 2 కోసమైతే ప్రేక్షకులు క్రేజీ అయిపోతారు. గామిలో రాకెట్ సైన్స్ ఏమీ లేదు. అందరికీ సులువుగా అర్థమవుతుంది’’ అని తెలిపాడు విశ్వక్ సేన్. అయితే టాలీవుడ్ పెద్దవారు అంటూ విశ్వక్  చేసిన వ్యాఖ్యలు ఇన్‌డైరెక్ట్‌గా ఎవరినో ఉద్దేశించినట్టు ఉన్నాయని నెటిజన్లు భావిస్తున్నారు.


ఆ సినిమాకే సపోర్ట్..


‘గామి’కి పోటీగా తెలుగులో అదేరోజు గోపీచంద్ హీరోగా నటించిన ‘భీమా’ విడుదలయ్యింది. కానీ ఈ రెండూ కాకుండా మలయాళం నుండి రీమేక్ అయిన ‘ప్రేమలు’ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. వారు మాత్రమే కాదు.. టాలీవుడ్ మేకర్స్, స్టార్ హీరోలు సైతం ‘ప్రేమలు’ను ప్రశంసించడం మొదలుపెట్టారు. ‘గామి’ విషయంలో మాత్రం అలా జరగలేదు. ఇప్పటికీ ‘గామి’కంటే ‘ప్రేమలు’ చూడడానికి థియేటర్లకు వెళ్తున్న ప్రేక్షకుల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఆరేళ్లు కష్టపడి సినిమా తీసిన తర్వాత దానికి పోటీగా వచ్చిన రీమేక్ సినిమాను అందరూ ఆదరిస్తుండడంతో.. ఆ బాధతోనే విశ్వక్ ఇలా మాట్లాడాడంటూ ఫ్యాన్స్ తనకు సపోర్ట్ చేస్తున్నారు. 


Also Read: మీడియాపై సీరియస్‌ అయిన హీరోయిన్‌ చాందిని చౌదరి - 'దానికే అంత ఫీల్ అవ్వాలా?'