Sanusha Santhosh: సనుషా సంతోష్ అంటే తెలుగు ప్రేక్షకులు పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు కానీ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బంగారం' సినిమాలో హీరోయిన్ చెల్లెలుగా నటించిన చిన్న పాప అంటే మాత్రం ఎవరైనా గుర్తు పడతారు. ఇందులో మీరా చోప్రా సిస్టర్ వింధ్య క్యారెక్టర్ పోషించిన సనుషా.. తన క్యూట్ క్యూట్ మాటలతో అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్ గా మారిన తర్వాత ఎక్కువగా తమిళ, మలయాళ చిత్రాల్లోనే నటించింది. పలు అవార్డులు రివార్డులు అందుకుంది. తెలుగులో చివరగా 'జెర్సీ' సినిమాలో కనిపించింది. అయితే సోషల్ మీడియా ద్వారా టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరగానే ఉంటోంది. 


సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే సనుషా సంతోష్.. ఎప్పటికప్పుడు తన వీడియోలు, ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉండేది. తన పర్సనల్, ప్రొఫెషనల్ అప్‌డేట్స్ అన్నీ పంచుకుంటూ వచ్చింది. ఒకప్పుడు కాస్త సన్నగా ఉండే ఈ బ్యూటీ.. తర్వాతి కాలంలో బొద్దుగా మారాడంపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. తన శరీరాకృతిపై ఎన్ని ట్రోల్స్ చేసినా పట్టించుకోకుండా, రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ వచ్చింది. కానీ ఆమె క్రమం క్రమంగా నెట్టింట తన యాక్టివిటీ తగ్గిస్తూ వచ్చింది. ఎందుకనో గత రెండున్నర నెలలుగా ఇన్స్టాలో ఒక్కటంటే ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. చివరగా గతేడాది డిసెంబర్ 1న తన ఫోటోని అభిమానులతో పంచుకుంది.


అయితే గతంలో సనుషా పొగ తాగుతూ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆమె ట్రెండీ కాస్ట్యూమ్స్ లో సిగరెట్ తాగుతూ, కార్డ్స్ ఆడుతూ డిఫరెంట్ లుక్ లో కనిపించింది. 'చెడు ఏదైనా అంత మంచి అనుభూతిని ఎలా కలిగిస్తుంది? మీరు ధూమపానం మానేస్తే మీకే మంచిది. ఇప్పటికేమీ ఆలస్యం కాలేదు' అని రాసుకొచ్చింది. దీన్ని బట్టి ఆమె స్మోకింగ్ ను ఎంకరేజ్ చేయటానికి కాకుండా, మానేయమని చెప్పడానికే ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. 


1998లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన సనుషా సంతోష్.. బాల నటిగా ఎన్నో సినిమాల్లో నటించింది. 2006లో వచ్చిన 'బంగారం' చిత్రం తర్వాత, 'రేణిగుంట' అనే తమిళ డబ్బింగ్ మూవీలో మూగ అమ్మాయిగా ఆకట్టుకుంది. ఇక 2012లో యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో హవీష్ హీరోగా తెరకెక్కిన ‘జీనియస్’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది ఈ కేరళ కుట్టి. కానీ ఆ తర్వాత తెలుగులో కథానాయికగా మరో మూవీ చేయలేదు. అయితే దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తర్వాత 'జెర్సీ' సినిమాలో కనిపించి, అందరినీ సర్ప్రైజ్ చేసింది. నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో కీలకమైన జర్నలిస్ట్ పాత్రలో ఆమె కనిపించింది.


2023లో 'జలధార పంపుసెట్ సిన్స్ 1962' అనే మలయాళ చిత్రంలో నటించిన సనుషా.. ప్రస్తుతం 'మరాఠకం', 'లిక్కర్ ఐలాండ్' వంటి సినిమాల్లో నటిస్తోంది. ఇక ఆమె సోదరుడు సనూప్ సంతోష్ కూడా చైల్డ్ ఆరిస్టుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 


Also Read: చిరంజీవి సినిమా స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టాను - 'చారి 111' డైరెక్టర్ కీర్తి కుమార్