Actress Divi Vadthya Break Up Story: బిగ్ బాస్‌తో ఫేమ తెచ్చుకున్న వాళ్లలో దివి ఒకరు. తన అందాలతో, అందమైన నవ్వుతో ఎంతోమంది కుర్రకారును తన ఫ్యాన్స్ ని చేసేసుకుంది ఈ బ్యూటీ. ఆమె ఫాలోయింగ్ మాములుగా ఉండదు యూత్ లో. అందరూ ఆమెను ముద్దుగా సొట్ట బుగ్గల చిన్నారి అని పిలుచుకుంటుంటారు. బిగ్ బాస్ లో మెరిసిన ఈ బ్యూటీ ఆ తర్వాత సినిమాలు కూడా చేసింది. ఇప్పుడిక 'లంబసింగి'లో మెయిన్ రోల్ ప్లే చేసింది. అయితే, ఆమెకు ఒక బ్రేకప్ స్టోరీ ఉందట. తన జీవితంలో అదే ఫస్ట్ లవ్ అని, మరిచిపోవడం కష్టమే అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది దివి. ఆ బ్రేకప్ స్టోరీ వినే వాళ్లకి కన్నీళ్లు తెప్పించింది.
చాలా చాలా ఇష్టం నాకు..
జబర్దస్త్ ఫేమ్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సుజాతకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్ లవ్ గురించి చెప్పింది దివి. కన్నీళ్లు పెట్టుకుంది. తన ఫస్ట్ లవ్ అని, ఇద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నామంటూ చెప్పుకొచ్చింది. "అది నా బీటెక్, ఎంటెక్ టైం. తను నా లైఫ్ లో ఎప్పుడూ ఉన్నాడు. మేం ఇద్దరం చాలా ఇష్టంగా ప్రేమించుకున్నాం. చాలా కలిసున్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు మా ఇంటికి వచ్చి అడిగాడు. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒప్పించుకున్నాడు. కానీ, మేం ఇద్దరం విడిపోయాం. రీజన్ ఏంటంటే? కరెక్ట్ గా పెళ్లి అనుకున్నప్పుడే తన తమ్ముడు చనిపోయాడు. దీంతో తను అక్కడే ఊరిలో ఉండిపోవాల్సి వచ్చింది. ప్రాక్టికల్ గా తను ఊరు వదిలేసి రాలేడు. దీంతో నన్ను ఊరిలో బంధించేస్తే నా లైఫ్ ఇబ్బందుల్లో పడిపోతుందేమో? నేను ఇబ్బంది పడతానేమో అనుకున్నాడు. హైదరాబాద్ లోనే పుట్టిన నేను బాగా తిరుగుతాను. కాబట్టి నేను ఇబ్బంది పడతాను అనుకున్నాడు. కానీ, నాది బ్రాడ్ మెంటాలిటీ. ఒక వేళ తను ఆ టైంలో వచ్చేయమని అడిగి ఉంటే తన కోసం, తన ప్రేమ కోసం అన్ని వదిలేసి వెళ్లిపోయే దాన్ని (కన్నీళ్లతో). ఆ టైంలో అలా జరగలేదు. నన్ను అడగలేదు. ఫ్యూచర్ లో సఫర్ అవుతానేమో, ఇబ్బంది పడతానేమో అని ఆలోచించాడు" అని తెలిపారు.
హ్యాపీగా ఉన్నాం..
"ఇప్పుడు ఎందుకో కన్నీళ్లు వచ్చాయి. కానీ, మేం చాలా హ్యాపీగా ఉన్నాం. తనకు పెళ్లైంది, పిల్లలు ఉన్నారు హ్యాపీగా ఉన్నాడు. మనకు నచ్చిన వాళ్లు హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది లైఫ్. దాని తర్వాత చాలామందిని కలిశాను. కానీ, వర్కౌట్ అవ్వలేదు. నా ఫస్ట్ లవ్ స్టోరీ అది. చాలా బాగుంటుంది. ఇద్దరిది అర్థం చేసుకునే గుణమే. అలా ఇద్దరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. నా కళ్లముందే చనిపోయాడు వాళ్ల తమ్ముడు. అవి చాలా ఘోరమైన రోజులు. ఆ పదిరోజులు అక్కడే తనతోనే ఉన్నాను. తనని కూడా చాలా బాగా చూసుకున్నాను. తమ్ముడు చనిపోయిన బాధలో ఉన్నాడని చేయి వదల్లేదు. ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉండేవాళ్లం. రిలేషన్ లో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటే ఆ రిలేషన్ చాలా బాగుంటుంది. లైఫ్ చాలా చాలా బాగుంటుంది. నాకు వచ్చే బాయ్ ఫ్రెండ్, లవర్ లేదా నా హస్బెండ్ ఎవరైనా నా బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటే నాకు ఇష్టం. ఏదైనా చెప్పుకోగలిగేలా ఉండాలి. నన్ను అర్థం చేసుకుంటే చాలు. అలాంటి వాళ్లే నా లైఫ్ లోకి రావాలి అనుకుంటున్నాను" అంటూ తన మనసులోని మాటలు బయటికి చెప్పింది దివి.
Also Read: ప్లానింగ్‌తోనే లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు, వరుణ్ తేజ్‌పై మెగాస్టార్ కామెంట్స్