ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద దిశా పటానీ (Disha Patani) నటించిన సినిమాలు తక్కువే. అయితే... హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆమె గ్లామర్ ఆడియన్స్ దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పుడు ఈ అందాల భామ హాలీవుడ్ ఇండస్ట్రీ (Hollywood Debut)లో అడుగు పెడుతోంది.


ఆస్కార్ విన్నర్ సినిమాలో దిశా!
కెవిన్ స్పేసీ... హాలీవుడ్ యాక్టర్ గుర్తున్నాడా? 'ది యూజువల్ సస్పెక్ట్స్' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నాడు. 'అమెరికన్ బ్యూటీ' సినిమాకు అయితే ఉత్తమ నటుడిగా అతడిని ఆస్కార్ వరించింది. అతడు డైరెక్టర్ కూడా. 'ఆల్బినో అలిగేటర్' (1996)తో దర్శకుడిగా అతడు ఇంటర్వ్యూస్ అయ్యాడు. 'బియాండ్ ద సీ' అని 2004లో మరొక సినిమా తీశాడు. 20 ఏళ్ల తర్వాత మరొకసారి మెగా ఫోన్ పట్టడానికి కెవిన్ రెడీ అయ్యాడు. ఆ సినిమా పేరు 'హోలీ గార్డ్స్'.


Also Read: 'దండోరా' సినిమాలో జై బాలయ్య సింగర్ అదితి భావరాజు... పాట కాదండోయ్, ఈసారి అంతకు మించి


యాక్షన్ థ్రిల్లర్ 'హోలీ గార్డ్స్'లో దిశా పటానీ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆల్రెడీ సినిమాకు ఆవిడ సంతకం చేశారని,‌ ఈ సినిమా షూటింగ్ అంతా మెక్సికోలో జరుగుతుందని, ఇందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ నటించిన ఉన్నారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.


Also Readహార్డ్ డిస్క్ దొరికేసింది... ఫైనల్లీ, పదహారు నెలల తర్వాత ఓటీటీలోకి రజనీకాంత్ సినిమా


ఇంతకు ముందు జాకీ చాన్ 'కుంగ్ ఫూ యోగ' సినిమాలో దిశా నటించారు. అది చైనీస్ ఫిల్మ్. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ హాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. దిశా పటానీ ఇండియన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే... బాలీవుడ్‌లో 'వెల్కమ్ టు ది జంగిల్' సినిమాలో నటిస్తున్నారు.