'అఖండ'లోని 'జై బాలయ్య' పాటతో పాటు పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడిన అమ్మాయి అదితి భావరాజు (Aditi Bhavaraju). ఇన్నాళ్ళూ తెరపై తన మాట వినిపించిన ఆ అమ్మాయి... ఇప్పుడు కనిపించబోతోంది. అవును... అదితి భావరాజు నటిగా ఎంట్రీ ఇస్తున్నారు.
'దండోరా' సినిమాలో అదితి!నిర్మాతగా మొదటి సినిమా 'కలర్ ఫోటో'తో అందరి దృష్టిని ఆకర్షించిన డైనమిక్ ప్రొడ్యూసర్, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పనేని... ఆ తర్వాత కార్తికేయ గుమ్మకొండ హీరోగా సూపర్ హిట్ 'బెదురులంక 2012' ప్రొడ్యూస్ చేశారు. ఆయన నిర్మిస్తున్న తాజా సినిమా 'దండోరా' (Dhandoraa Movie).
గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కిస్తున్న సినిమా 'దండోరా'. ఇదొక ప్రేమ కథా చిత్రం. అయితే... ఇప్పటికీ సమాజంలో కొనసాగుతోన్న సామాజిక దుష్పప్రవర్తలను, కఠినమైన నిజాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు ప్రధాన తారాగణం. వాళ్ళతో పాటు అదితి భావరాజు కూడా సినిమాలో యాడ్ అయ్యారు. ఈ సినిమాతో నటిగా ఆవిడ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇస్తున్నారు. 'దండోరా'లో ఆవిడ ఒక కీలక పాత్ర చేస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read: హార్డ్ డిస్క్ దొరికేసింది... ఫైనల్లీ, పదహారు నెలల తర్వాత ఓటీటీలోకి రజనీకాంత్ సినిమా
'దండోరా' గురించి దర్శక నిర్మాతలు మాట్లాడుతూ... ''ప్రస్తుతం చిత్రీకరణ జోరుగా జరుగుతోంది. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ పూర్తి చేశాం. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని అన్నారు.
Also Read: శ్రీలంకలోనూ జిమ్ స్కిప్ చేయని అనసూయ... ఆ డెడికేషన్ ఏంటండీ బాబు
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ 'దండోరా' సినిమాకు సంగీతం: మార్క్ కె. రాబిన్, సినిమాటోగ్రాఫీ: వెంకట్ ఆర్. శాఖమూరి, ఎడిటర్: సృజన అడుసుమిల్లి, ఆర్ట్ డైరెక్టర్; క్రాంతి ప్రియం, కాస్ట్యూమ్ డిజైనర్: రేఖా బొగ్గారపు, నిర్మాణ సంస్థ: లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని, దర్శకత్వం: మురళీకాంత్.