స్టార్ హీరోల సినిమాలైనా సరే... థియేటర్లలో విడుదలైన రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో ఓటీటీల్లోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే నాలుగు వారాలకే డిజిటల్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో 16 నెలలకు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఓటీటీలోకి వస్తుండడం విశేషం.
'లాల్ సలామ్' విడుదలకు ఓటీటీ రెడీ...నెట్‌ఫ్లిక్స్ లేదా ప్రైమ్ వీడియో కాదండోయ్!రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన సినిమా 'లాల్ సలామ్'. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలు. ఫిబ్రవరి 9, 2024లో ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. సుమారు 90 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయ్యింది. కేవలం 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. దాంతో త్వరలో ఓటీటీలో వస్తుందని ఆడియన్స్ అందరూ ఆశించారు. అయితే... థియేటర్లలో విడుదలైన 16 నెలలకు గాని ఓటీటీలోకి రావడం లేదు.
'లాల్ సలామ్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత కోలీవుడ్ వర్గాల నుంచి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ఐశ్వర్య దర్శకత్వం వహించిన సినిమాలో కొన్ని సన్నివేశాలు మిస్ అయ్యాయని. హార్డ్ డిస్క్ పోవడంతో కొన్ని సీన్స్ మిస్ అయ్యాయని, అందుకే సినిమా బాలేదని చెన్నై కోడంబాక్కమ్ వర్గాలలో వినిపించింది. ఆ తర్వాత అది నిజమే అనే వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు సినిమా ఓటీటీలోకి విడుదలకు రెడీ అవుతుండడంతో హార్డ్ డిస్క్ దొరికిందంటూ సోషల్ మీడియాలో కొంతమంది సెటైర్లు వేస్తున్నారు.
Also Read: శ్రీలంకలోనూ జిమ్ స్కిప్ చేయని అనసూయ... ఆ డెడికేషన్ ఏంటండీ బాబు
నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 'లాల్ సలామ్' రిలీజ్ కావడం లేదు సన్ నెక్స్ట్ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఆ ఓటీటీ వేదిక అధికారికంగా ఒక ట్వీట్ చేసింది. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న 'జైలర్ 2 సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. అంతకు ముందు 'జైలర్' ద్వారా ఆ సంస్థ విపరీతమైన లాభాలు గడిచింది. రజనీతో ఉన్న అనుబంధం దృష్ట్యా సన్ నెక్స్ట్ 'లాల్ సలామ్' సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చినట్లు ఉన్నారు. బక్రీద్ సందర్భంగా సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు సన్ నెక్స్ట్ పేర్కొంది. జూన్ 6వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.