టాలీవుడ్ స్క్రీన్ మీద మైథాలజికల్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిమ్స్ కొన్ని వచ్చాయి. అయితే... 'యముడు' ఆయా సినిమాలకు కాస్త భిన్నంగా తెరకెక్కిన సినిమాగా కనబడుతోంది. నవీన్ చంద్ర చేతుల మీదుగా తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులలో ఆసక్తి క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.
యముడి వేషధారణలో హత్యలు ఎందుకు?జగదీష్ ఆమంచి (Jagadeesh Amanchi) ప్రధాన పాత్రలో నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో జగన్నాధ పిక్చర్స్ పతాకం మీద ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'యముడు'. ధర్మో రక్షతి రక్షితః... అనేది ఉప శీర్షిక. ఇందులో శ్రావణి శెట్టి హీరోయిన్. ఆకాష్ చల్లా ప్రధాన తారాగణం.
'యముడు' టీజర్ ప్రారంభంలో సముద్ర తీరంలోని ఒక నగరాన్ని చూపించారు. బహుశా... విశాఖ లేదా కాకినాడ అయి ఉండొచ్చు. హార్బర్ ఏరియాలో ఒక అమ్మాయి శవాన్ని ప్రజలు చూస్తారు. ఆ మృతదేహం చుట్టూ గుమిగూడిన ప్రజలు నగరంలో వరుస హత్యలు సర్వసాధారణం అయ్యాయని మాట్లాడుకుంటారు. అది కూడా అమ్మాయిలను మాత్రమే చంపేస్తున్నారని జనాలు మధ్య చర్చకు వస్తుంది. యముడి వేషం వేసి అమ్మాయిలు చంపేస్తున్న వ్యక్తి ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
Also Read: శ్రీలంకలోనూ జిమ్ స్కిప్ చేయని అనసూయ... ఆ డెడికేషన్ ఏంటండీ బాబు
నాటకాలలో యముడి వేషం వేసే వ్యక్తి అమ్మాయిలను ఎందుకు టార్గెట్ చేశారు? అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్. నరకంలోని యముడు భూమి మీదకు వచ్చాడా? లేదంటే యముడి ఆత్మ ఇక్కడ ఆవహించిందా? అనేది సస్పెన్స్. ఈ కథలో శ్రావణి శెట్టి పాత్ర ఏమిటి అనేది తేరి మీద చూడాలి. హీరో - దర్శక నిర్మాత జగదీష్ ఆమంచితో హరి అల్లసాని కథ రాయగా... శివ కుండ్రపు స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రానికి కూర్పు: కేసీబీ హరి, ఛాయాగ్రహణం: విష్ణు రెడ్డి వంగా, సంగీతం: భవాని రాకేష్.