Puri Jagannadh With Vijayendra Prasad: స్టార్ డైెరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి మూవీతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ప్రముఖ రచయిత, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను కలిశారు. ఈ ఫోటోలు వైరల్ కాగా అసలు ఎందుకు ఆయన్ను కలిశారో అంటో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

Continues below advertisement


కొన్ని క్షణాలు..


కొన్ని క్షణాలు మన హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయంటూ పూరీ జగన్నాథ్.. విజయేంద్ర ప్రసాద్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'కొన్ని క్షణాలు మన హృదయంలో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. లెజెండరీ విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి విలువైన సమయాన్ని గడిపాను. ఆయన వినయం, జ్ఞానం, ప్రతీ విషయంలోనూ ఆయనకు ఉన్న క్లారిటీ అన్నీ నాలో స్ఫూర్తిని నింపాయి.' అంటూ పూరీ రాసుకొచ్చారు. ఈ ఫోటోలో వారితో పాటు నటి ఛార్మి కూడా ఉన్నారు.






అసలు రీజన్ ఏంటో?


ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతి మూవీలో నటీనటుల కోసం ఎంపిక చేసే ప్రక్రియలో బిజీగా ఉన్నారు. ఈ టైంలో విజయేంద్ర ప్రసాద్‌ను కలవడం ఆసక్తిగా మారింది. ఆయన్ను ఎందుకు కలిశారో అంటో సోషల్ మీడియాలో అప్పుడే చర్చ కూడా మొదలైంది. అయితే.. పూరీ జగన్నాథ్ తన ఫేవరెట్ అంటూ పలు సందర్భాల్లో విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆయన మూవీ తీసే విధానం, వర్క్ అంటే తనకు చాలా ఇష్టమంటూ చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. మరి మూవీస్‌కు సంబంధించే కలిశారా? లేదా క్యాజువల్‌గా కలిశారా అనేది తెలియాల్సి ఉంది.


Also Read: భైరవం రివ్యూ: ధర్మం కోసం ముగ్గురు మిత్రుల మధ్య యుద్ధం... టెంపుల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఎలా ఉందంటే?


జూన్ నుంచి షూటింగ్


పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతితో మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచీ భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక సాగుతుండగా జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మూవీలో విజయ్ సేతుపతితో పాటు టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ నటిస్తారని ఇప్పటికే టీం అధికారికంగా ప్రకటించింది. అయితే, హీరోయిన్ ఎవరనేది ఇంకా క్లారిటీ లేదు. టబు కీలక రోల్ చేస్తున్నారని.. మరో హీరోయిన్‌గా రాధికా ఆప్టేను తీసుకుంటారనే ప్రచారం సాగింది.


కానీ.. ఆ వార్తల్లో నిజం లేదంటూ రాధికా తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. మరి హీరోయిన్ ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. అటు.. ఈ మూవీకి 'బెగ్గర్' టైటిల్ ప్రచారంలో ఉండగా.. అందులో నిజం లేదంటూ ఇటీవలే విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. పూరీ జగన్నాథ్‌తో మూవీ చేసేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.