సంగీత దర్శకుడు తమన్ (Thaman)కు విమర్శలు కొత్తేమీ కాదు. ప్రతి సినిమాకూ, ప్రతి పాటకూ ఆయన ట్రోల్ అవుతూ ఉన్నారు. ఆ మధ్య 'భగవంత్ కేసరి' సినిమా ఇంటర్వ్యూలలో కూడా తనపై సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చపై ఘాటుగా మాట్లాడారు. కట్ చేస్తే... ఇప్పుడు 'గుంటూరు కారం' సినిమాలో ఫస్ట్ సాంగ్ 'దమ్ మసాలా' వచ్చింది. దీనిపై కూడా ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.
'దమ్ మసాలా...' తమన్ ఒరిజినల్ కాదా?
హిందీ సాంగ్ 'ధూమ్ మచాలే'ని కాపీ చేశారా?
హిందీలో సూపర్ హిట్ సినిమా ఫ్రాంచైజీ 'ధూమ్' గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ముఖ్యంగా అందులో 'ధూమ్ మచాలే... ధూమ్ మచాలే' సాంగ్ చాలా పాపులర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు కానుకగా 'గుంటూరు కారం' నుంచి విడుదల చేసిన 'దమ్ మసాలా....' పాటలో ఓ బిట్, ఆ 'ధూమ్ మచాలే...' పాటకు దగ్గర దగ్గరగా ఉందనేది నెటిజన్స్ ఆరోపణ. అందుకు చిన్న ఉదాహరణ... ఈ కింద ఉన్న క్లిప్.
Also Read : నా బాడీ వాడుకున్నారు, రష్మిక వీడియోతో నాకు సంబంధం లేదు - బ్రిటిష్ ఇండియన్ మోడల్ రియాక్షన్
పాపం తమన్... నెటిజన్ ట్వీట్ చూశారా?
''ఎవరైనా హీరో సాంగ్ విడుదల అయితే బాగుందా లేదా అని విని చెబుతారు. కానీ, తమన్ సంగీత దర్శకుడిగా ఉన్న సినిమాలో సాంగ్ విడుదల అయితే మాత్రం ఏ సినిమాలో సాంగ్ మ్యూజిక్ కాపీ కొట్టాడా? అని వెతికి వెతికి చూస్తారు. పాపం తమన్ మావా'' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : పవన్ కళ్యాణ్ సినిమాపై పుకార్లకు చెక్ పెట్టిన హరీష్ శంకర్ - 'నో' రవితేజ సినిమా!
మహేష్ అభిమానులకు సాంగ్ నచ్చింది!
ట్రోల్స్, విమర్శలను పక్కన పెడితే.... వాటికి అతీతంగా ఎప్పటికప్పుడు తమన్ వరుస విజయాలు సాధిస్తున్నారు. 'దమ్ మసాలా...' సాంగ్ సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు నచ్చింది. ముఖ్యంగా మహేష్ బాబును త్రివిక్రమ్ ప్రజెంట్ చేసిన తీరుకు ఫిదా అవుతున్నారు. అదీ సంగతి!
'దమ్ మసాలా...' కోసం తమన్ అందించిన బాణీకి సరస్వతీపుత్ర రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. మధ్యలో వచ్చే స్పైసీ ర్యాప్ త్రివిక్రమ్ రాయడం విశేషం. సంజిత్ హెగ్డేతో కలిసి సంగీత దర్శకుడు తమన్ ఈ పాటను పాడటం మరో విశేషం. 'నేనో నిశ్శబ్దం... అనినిత్యం నాతో నాకే యుద్ధం' లైనులో మాటల మాంత్రికుడి టేస్ట్ స్పష్టంగా వినబడుతోంది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) ప్రొడ్యూస్ చేస్తున్న 'గుంటూరు కారం'లో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి సినిమా రానుంది.