Harish Shankar refutes rumors about a film with Ravi Teja : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కేవలం సినిమా కథానాయకుడు మాత్రమే కాదు... ఆయన రాజకీయ నాయకులు కూడా! జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు సినిమా షూటింగులు... మరో వైపు రాజకీయ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు.
ఒక్కోసారి పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ వల్ల సినిమా చిత్రీకరణలు ఆలస్యం అవుతున్నాయనే కామెంట్స్ కూడా వినపడుతూ ఉన్నాయి. లేటెస్టుగా అటువంటి కామెంట్ ఒకటి వచ్చింది. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా పక్కన పెట్టి... దర్శకుడు హరీష్ శంకర్ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. ఆ ప్రచారంలో నిజం లేదని హరీష్ క్లారిటీ ఇచ్చారు.
ఆ రెండూ తప్పే - హరీష్ శంకర్
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో కొత్తగా ఓ వార్త చక్కర్లు కొట్టడం మొదలు అయ్యింది. జనవరి నుంచి ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారని సదరు వార్తల సారాంశం. ఇప్పటి వరకు 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రీకరణ కేవలం 20 రోజులు మాత్రమే జరిగిందని, అందుకని ఆ సినిమా పక్కన పెట్టి మరో సినిమా చేయడానికి హరీష్ రెడీ అవుతున్నారని సోషల్ మీడియా వేదికగా ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. అప్పుడు హరీష్ శంకర్ ''రెండూ రాంగ్! ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచిది'' అని క్లారిటీ ఇచ్చారు.
Also Read : వైఎస్ జగన్ 'యాత్ర 2'లో సోనియా గాంధీ - ఫస్ట్ లుక్ వచ్చేసింది!
'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకరైన మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల ఓ కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా అఖిల్ అక్కినేని 'ఏజెంట్', వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' సినిమాల ఫేమ్ సాక్షి వైద్య నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ సాయి కళా దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : ఆ పెళ్లి కొడుకు ఎవరో నాకూ చెప్పండయ్యా - అల్లు కామెంట్స్ వైరల్ కావడంతో హీరోయిన్ క్లారిటీ
కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన హరీష్ శంకర్ త్వరలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా విడుదల తేదీ వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'ఓజీ' తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్'ను విడుదల చేయడమని ఓ నెటిజన్ కోరగా... అది మన చేతుల్లో లేదని హరీష్ శంకర్ చెప్పారు. ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా మాత్రం అవుతుందని ఆయన అన్నారు.