ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘జవాన్’ పేరే వినిపిస్తోంది. మామూలుగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుందంటూ బీ టౌన్ అంతా పండగ చేసుకుంటుంది. ఆయన నటించిన సినిమా యావరేజ్‌గా ఉంటేనే.. కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటిది ఆ మూవీకి హిట్ టాక్ అందితే.. రికార్డులు ఏ రేంజ్‌లో క్రియేట్ అవుతాయో ‘జవాన్’ చూస్తే తెలుస్తోంది. ‘జవాన్’ కోసం చాలావరకు సౌత్ నటీనటులనే రంగంలోకి దించాడు అట్లీ. వారితో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా ఒక గెస్ట్ రోల్‌లో కనిపించింది. అయితే ఈ సినిమాలో నటించడం కోసం దీపికా అసలు పారితోషికమే తీసుకోలేదు అన్న వార్త ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.


ఐశ్వర్య రాథోడ్‌గా దీపికా పదుకొనె..
షారుఖ్ ఖాన్.. ఇప్పటికే ఈ ఏడాదిలో ‘పఠాన్’తో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. తాజాగా విడుదలయిన ‘జవాన్’... అంతకు మించిన హిట్ అయ్యింది. వెండితెరపై దాదాపు అయిదు సంవత్సరాలు ఎస్‌ఆర్‌కే కనిపించలేదు. కానీ ఒకే ఏడాదితో డబుల్ ధమాకా ఇచ్చి ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశాడు. లేటెస్ట్ మూవీ ‘జవాన్’లోని ప్రతీ అంశం గురించి ప్రేక్షకులు ఇంకా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అందులో దీపికా పదుకొనె గెస్ట్ రోల్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ‘జవాన్’లో ఐశ్వర్య రాథోడ్ పాత్రలో కనిపించింది దీపికా. స్క్రీన్‌పై తన పాత్ర కనిపించింది కాసేపే అయినా భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే ఇంత పవర్‌ఫుల్ పాత్ర కోసం దీపికా అసలు రెమ్యునరేషనే తీసుకోలేదని సమాచారం.


ఛార్జ్ చేయను..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికాకు 'అసలు గెస్ట్ రోల్స్ కోసం మీరు ఎంత ఛార్జ్ చేస్తారు?' అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి ‘‘నేను అసలు ఏమీ ఛార్జ్ చేయను’’ అని సూటిగా చెప్పేసింది దీపికా. ఇండియన్ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘83’ సినిమాలో దీపికా ఫ్రీగా నటించింది. 'ఎందుకు?' అని ప్రశ్నించగా... భర్త పక్కన ఉంటూ సపోర్ట్ చేసే భార్య పాత్రలంటే తనకు చాలా ఇష్టమని, తన తల్లి అలా చేయడం చూస్తూ పెరిగానని బయటపెట్టింది. అది కాకుండా షారుఖ్ ఖాన్, రోహిత్ శెట్టి సినిమాల్లో గెస్ట్ రోల్స్ అంటే తాను అసలు పారితోషికం తీసుకోకుండా చేస్తానని అంటోంది దీపికా పదుకొనె.


Also Read : రూటు మార్చిన రతిక, ఈసారి యావర్‌తో ప్రేమ డ్రామా - శివాజీ, షకీలా ఫ్రస్ట్రేషన్!


లక్ కాదు.. అంతకు మించి..
షారుఖ్ ఖాన్‌తో దీపికా పదుకొనెకు చాలా ప్రత్యేకమైన స్నేహం ఉంది. అసలు దీపికా హీరోయిన్‌గా పరిచయమయ్యిందే షారుఖ్ సినిమాతో. అందుతకే షారుఖ్‌తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది దీపికా. ‘‘మేము ఒకరికి ఒకరం లక్కీ ఛార్మ్. నిజం చెప్పాలంటే అంతకు మించి. మాకు ఒకరి మీద ఒకరికి హక్కు ఉందని భావిస్తుంటాం. షారుఖ్ చాలా సన్నిహితంగా ఉండే అతి తక్కువమంది మనుషుల్లో నేను ఒకదాన్ని. మా మధ్య చాలా ప్రేమ, గౌరవం ఉంటాయి. దాంతో పాటు కూడా లక్ కూడా కలిసి రావడం విశేషం’’ అని తమ స్నేహం గురించి వివరించింది దీపికా. ఇప్పటికే షారుఖ్, దీపికా హీరోహీరోయిన్లుగా ‘ఓం శాంతి ఓం’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రాల్లో నటించగా.. షారుఖ్ హీరోగా తెరకెక్కిన ‘బిల్లు’, ‘జీరో’ చిత్రాల్లో దీపికా గెస్ట్ రోల్స్‌లో నటించింది.


Also Read: టాలీవుడ్‌లోకి ‘సైరత్‘ బ్యూటీ - ఆ మూవీలో హీరోయిన్‌గా ఫిక్స్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial