'నాన్నోయ్ రైలు తెమ్మన్నాను తెచ్చావా?' - 'అతడు'లో బ్రహ్మానందంతో ఓ చిన్నోడు చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఇప్పుడు ఆ చిన్నోడు పెద్దోడు అయ్యాడు. హీరోగా 'సిద్ధార్థ్ రాయ్' సినిమా చేశాడు. ఆ అబ్బాయి పేరు దీపక్ సరోజ్ (Deepak Saroj). ఇప్పుడు ఆ అబ్బాయి హీరోగా కొత్త సినిమా ఈ రోజు మొదలైంది. శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ సంస్థలో రూపొందుతున్న ఈ సినిమాతో హరీష్ గదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తన్నీరు హరిబాబు నిర్మాత.
దీపక్ సరోజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీక్షిక, అనైరా హీరోయిన్లు. ఈ రోజు సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకులు 'నీది నాదీ ఒకే కథ', 'విరాట పర్వం' సినిమాల ఫేమ్ వేణు ఊడుగుల, 'వికటకవి' వెబ్ సిరీస్ ప్రదీప్ మద్దాలి, 'కమిటీ కుర్రాళ్ళు' ఫేమ్ యదు వంశీ, 'క' ఫేమ్ సుజిత్ - సందీప్ సహా సందీప్ సరోజ్, భరత్ పెద్దగాని, ఉదయ్ శర్మ, వంశీ చాగంటి, 'హైపర్' ఆది, 'రచ్చ' రవి హాజరయ్యారు. ముహూర్తపు సీన్‌కు వేణు ఉడుగుల క్లాప్ ఇవ్వగా... సుజిత్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి సందీప్ డైరెక్షన్ చేశారు. దర్శకుడికి ప్రదీప్ మద్దాల, యదువంశీ స్క్రిప్ట్ అందజేశారు.
రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ సినిమా
సినిమా ప్రారంభోత్సవంలో హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ... ''రొమాంటిక్ కల్ట్ లవ్ స్టోరీ (Romantic Cult Love Story Movie)తో యూత్‌ఫుల్ లవ్ జానర్‌లో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభించి, ఏప్రిల్‌లో సినిమా పూర్తి చేస్తాను. అనూప్ రూబెన్స్ నా సినిమాకు సంగీతం అందించడం సంతోషంగా ఉంది. మా సినిమా నిర్మాత హరిబాబు గారికి ఇది మొదటి సినిమా. కానీ, ఆయన చాలా రోజులు ఇండస్ట్రీలో ఉంటారు'' అని అన్నారు. నిర్మాత హరిబాబు మాట్లాడుతూ... ''నేను రియల్ ఎస్టేట్ నుంచి సినిమాల్లోకి వచ్చాను. ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలని లక్ష్మీ నరసింహ ఆర్ట్స్ స్థాపించా. కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నా'' అని చెప్పారు.
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
Deepak Saroj New Movie: దీపక్ సరోజ్, దీక్షిక, అనైరా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రఘుబాబు, 'హైపర్' ఆది, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మ రాజు , 'రచ్చ' రవి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: ప్రసాద్, కో డైరెక్టర్: అనిల్ బోయిడాపు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అర్జున్ సాయి, యాక్షన్ దర్శకుడు: మదికొండ నటరాజ్, ఛాయాగ్రహణం: సురేష్ రగుతు, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాణ సంస్థ: శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్స్, నిర్మాత: తన్నీరు హరిబాబు, రచన - దర్శకత్వం: హరీష్ గద గాని.
Also Read: పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?