థియేటర్లలో 'పుష్ప 2' విడుదలైంది. సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. యాంటీ ఫ్యాన్స్ లేదా కొంత మంది సినిమా బాలేదని నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అది బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించే అవకాశాలు తక్కువ. మెజారిటీ ఆడియన్స్ నుంచి సినిమాకు అప్రిసియేషన్ వస్తోంది. పుష్ప రాజ్ క్యారెక్టరైజేషన్, గంగమ్మ జాతర ఎపిసోడ్, యాక్షన్ బ్లాక్స్ వంటి అంశాలతో మెస్మరైజ్ చేసిన సుకుమార్... కొన్ని ప్రశ్నలు అలా వదిలేశారు.


పుష్ప ఎక్కడ? అసలు ఆ సీన్ లేదుగా!
Where Is Pushpa పేరుతో 'పుష్ప 2' అనౌన్స్ చేశారు. ఓ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా 'పోలీస్ డౌన్ డౌన్' అంటూ ప్రజలు నిదానాలు చేయడం చూపించారు. తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకున్నాడని వార్తల్లో న్యూస్ రీడర్ చెప్పడం చూపించారు సుకుమార్. పోలీసులు పుష్ప మీద పది రౌండ్లు కాల్పులు జరిపారని కూడా డైలాగ్ ఉంది. అన్ని గాయాలతో మనిషి అసలు బ్రతికే అవకాశం లేదని కొందరు న్యూస్ ఛానల్స్ డిబేట్లలో తేల్చేస్తారు. తర్వాత అడివిలో పుష్ప కనిపిస్తాడు. 


'అడివిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయి అంటే పులి వచ్చింది అని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేస్తే? పుష్ప వచ్చాడని అర్థం' అని ఆ అనౌన్స్‌మెంట్‌ వీడియో చివరలో డైలాగ్ ఉంటుంది. అసలు ఆ సీన్ 'పుష్ప 2'లో లేనే లేదు. మరి, ఏం చేశారు? అనేది క్వశ్చన్. పార్ట్ 3లో చూపిస్తారు ఏమో సుక్కు.



జపాన్ ఎందుకు వెళ్ళాడు? పుష్ప అక్కడ ఏం చేశాడు?
'పుష్ప 2' చూసిన జనాలకు ఇప్పుడు చెప్పే సీన్ బాగా అర్థం అవుతుంది. జపాన్ పోర్టులో హీరో ఇంట్రడక్షన్ తీశారు సుకుమార్. తన సరుకు ఎక్కడకు వెళుతుందో తెలుసుకోవడం కోసం కంటైనర్‌లో జపాన్ వచ్చానని, 40 రోజులు ఖాళీగా ఉండటం ఎందుకు అని 30 రోజుల్లో జపనీస్ నేర్చుకున్నానని చెబుతాడు. అంతా బావుంది. ఆ ఫైట్ తర్వాత జపాన్ ఊసే ఉండదు. 'పుష్ప 2' ట్రైలర్ చూస్తే... కరెక్టుగా 1.35 సెకన్స్ దగ్గర జపాన్ రెస్టారెంట్‌లో అల్లు అర్జున్ ఎవరితోనో డీల్ చేస్తారు. ఆ సీన్ కూడా సినిమాలో లేదు. 


జపాన్ రెస్టారెంట్ సన్నివేశానికి ముందు ట్రైలర్‌లో జాలి రెడ్డి (డాలీ ధనుంజయ) కూడా కనిపిస్తాడు. జాలి రెడ్డి ఎవరికో గన్ గురి పెడతారు. ఆ సీన్ కూడా 'పుష్ప 2'లో లేదు. ఎండింగ్ టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు వస్తాడు జాలి రెడ్డి. పార్ట్ 3లో ఆయన క్యారెక్టర్ కీలకం కానుంది ఏమో!? పుష్ప శివమాల ఎందుకు వేశాడు? భన్వర్ సింగ్ షెకావత్ నదిలో స్నానం చేసే సీన్ ఎందుకు తీసేశారు? అనేది పార్ట్‌ 3లో చూడాలి ఏమో!?


Also Readపుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?



బ్లాస్ట్ చేసింది ఎవరు? బ్లాస్ట్ తర్వాత ఏం జరిగింది?
'పుష్ప 2' ఎండింగ్ అందరికీ నచ్చిందని చెప్పలేం. బీభత్సమైన హై ఇచ్చిన కోట ఫైట్ తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్స్ అందరినీ మెప్పించాయని చెప్పలేం. పార్ట్ 3 కోసం సరైన లీడ్ ఇవ్వలేదని ఫ్యాన్స్ సహా ఆడియన్స్ కొందరు ఫీలయ్యారు. కానీ, సుకుమార్ చాలా తెలివిగా కొన్ని ప్రశ్నలు వదిలేశారు. పైన పేర్కొన్న ప్రశ్నలకు తోడు మరో రెండు బ్లాస్టులు 'పుష్ప 3'లో కీలకం కానున్నాయి.


ట్విస్ట్ రివీల్ చేయకుండా చెప్పాలంటే... భన్వర్ సింగ్ షెకావత్ ఒక బ్లాస్ట్ దగ్గర ఉంటారు. ఆ తర్వాత ఆయన క్యారెక్టర్ కనిపించదు. ఆయనతో బ్రహ్మాజీ రోల్ కూడా తర్వాత లేదు. మరి, ఆ బ్లాస్ట్ తర్వాత ఏమైంది? అనేది క్వశ్చన్. మరొక బ్లాస్ట్ క్లైమాక్స్ ముగిసిందని అనుకున్నప్పుడు జరిగింది. అది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది మరొక క్వశ్చన్. వీటికి సమాధానాలు 'పుష్ప 3: ది ర్యాంపేజ్'లో లభిస్తాయి.


Also Read: ‘పుష్ప 2’ జాతర ఎపిసోడ్‌కు సౌదీ అరేబియా సెన్సార్ - కర్ణాటకలోనూ కోలుకోలేని షాక్... విషయం ఏమిటంటే?