ఈటీవీ విన్ యాప్ (ETV Win App) ఎటువంటి పరిధులు గీసుకోలేదు. మన తెలుగు ప్రజల్లో ఈటీవీ, ఈనాడు ట్రెడిషనల్ మీడియా అని ఒక అభిప్రాయం ఉంది. కానీ, ఈటీవీ విన్ అలా కాదు. మోడ్రన్ పంథాలో ముందుకు వెళుతోంది. యూత్ ఫుల్, రొమాంటిక్ మూవీస్ స్ట్రీమింగ్ చేస్తోంది. డిసెంబర్ రెండో వారంలో అటువంటి ఓ సినిమాను తీసుకు వస్తోంది. 


డిసెంబర్ 12 నుంచి 'రోటి కపడా రొమాన్స్' స్ట్రీమింగ్!
Roti Kapda Romance OTT Streaming Date: ఈటీవీ విన్ ఓటీటీలో వైష్ణవి చైతన్య 'బేబీ' స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే'తో పాటు ఈ తరహా సినిమాలు ఇంకొన్ని ఉన్నాయి. ఇప్పుడు 'రోటి కపడా రొమాన్స్'ను స్ట్రీమింగ్ చేయడానికి ఈటీవీ విన్ రెడీ అయ్యింది.


నలుగురు అబ్బాయిలు... హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా 'రోటి కపడా రొమాన్స్'. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. 'హుషారు', 'సినిమా చూపిస్త మావ', 'మేం వయసుకు వచ్చాం', 'ప్రేమ ఇష్క్ కాదల్', 'పాగల్' వంటి యూత్ ఫుల్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసిన లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ నిర్మాత. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిసెంబర్ 12న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ యాప్ తెలిపింది.


Also Readసుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?



పెళ్లికి ముందు ప్రేమికులు రొమాన్సులో మునిగి తేలితే?
నవంబర్ 28న థియేటర్లలో 'రోటి కపడా రొమాన్స్' విడుదల అయ్యింది. దానికి ఓ వారం ముందు నుంచి ప్రీమియర్ షోలు వేశారు. అక్కడ రెస్పాన్స్ బాగా వచ్చింది. కానీ, పెద్ద సినిమాల తాకిడి వల్ల ఇప్పుడు థియేటర్లలో లేదు. అందుకని, రెండు వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది.


Also Readపుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?



'రోటి కపడా రొమాన్స్' కథ విషయానికి వస్తే... నాలుగు జంటల మధ్య జరిగే సినిమా ఇది. ఒక్కో జంటది ఒక్కో కథ. అయితే... నలుగురు అబ్బాయిలు స్నేహితులు. ఓ కుర్రాడు పెళ్లికి ముందు అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెతో రొమాన్సులో మునిగి తేలతాడు. చివరకు బ్రేకప్ అవుతుంది. మరొక కుర్రాడు ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితులను వదిలి ఆమెతో పాటు ఆమె ఫ్లాట్‌కు షిఫ్ట్ అవుతాడు. వాళ్లిద్దరి మధ్య కూడా బ్రేకప్ అవుతుంది. మరొక కుర్రాడు అమ్మాయికు ఉద్యోగం ఇప్పించడం నుంచి ఏ సహాయం కావాలన్నా చేస్తాడు. ఆ అమ్మాయి అతడిని అవాయిడ్ చేస్తుంది. ఇంకొక అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగితే అబ్బాయి వెనుకంజ వేస్తాడు. చివరకు ఆ నాలుగు జంటల కథలు ఎలా ముగిశాయి? అనేది సినిమా.