మంచి సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా, అక్కినేని నాగ చైతన్య స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నారు. ఆయన నటించి చిత్రాల్లో ఇప్పటి వరకూ చెప్పుకోదగిన విజయాన్ని అందుకున్న సినిమా లేదనే చెప్పుకోవచ్చు. ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో హిందీలో అడుగు పెట్టినా, అక్కడా నిరాశే ఎదురయ్యింది. అమీర్ ఖాన్ తో కలిసి నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. తాజాగా ఆయన నటించిన ‘కస్టడీ’ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నాడు చై. మే 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ సినిమా తొలి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..  


బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచిన 'కస్టడీ'


అక్కినేని నాగ చైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు 'కస్టడీ' సినిమానుతెరకెక్కించారు.  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి నిర్మించారు.  కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.   ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. కాగా, ఈ సినిమాకు అన్ని చోట్లా  మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆశించిన రీతిలో రెస్పాన్స్ రాలేదు. విడుదలైన తొలి రోజున తక్కువ కలెక్షన్లు వచ్చాయి.  ‘కస్టడీ’ చిత్రానికి మార్కెట్ లో పెద్ద హైప్ లేకపోవడం తో అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే జరిగాయి. ఇక డివైడ్ టాక్ రావడం తో మ్యాట్నీస్ కి మార్నింగ్ షోస్ తో పోలిస్తే 50 శాతానికి పైగా డ్రాప్స్ పడ్డాయి.  ఫస్ట్ షోస్ కి మ్యాట్నీస్ తో పోలిస్తే 70 శాతం వరకు వసూళ్లు డ్రాప్ అయ్యాయి. 


‘కస్టడీ’ తొలి రోజు కలెక్షన్ ఎంతంటే?   


కస్టడీ సినిమాకు తొలి రోజు ఓవరాల్ గా 3.9 కోట్ల  షేర్ సాధించగా, 7.4 కోట్ల గ్రాస్ వసూళు చేసింది.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమాకు రూ. 2.30 - 2.50 కోట్లు మేర షేర్ వచ్చినట్లు తెలిసింది. మిగిలిన ప్రాంతాలతో పాటు తమిళ వెర్షన్‌ వసూళ్లను కూడా కలుపుకుంటే  3.90 కోట్లు వచ్చాయి.


Also Read : 'కస్టడీ' సినిమా రివ్యూ : నాగ చైతన్య సక్సెస్ కొట్టారా? డిజప్పాయింట్ చేశాడా?



కస్టడీ మూవీ బిజినెస్ ఎంతంటే?


'కస్టడీ' మూవీకి నైజాంలో రూ. 7.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 8.50 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో రూ. 18.20 కోట్ల బిజినెస్ అందుకుంది. కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.40 కోట్లు, తమిళ వెర్షన్‌కు రూ. 2.20 కోట్ల బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.00 కోట్ల బిజినెస్ లభించింది.






Read Also: బానిసత్వానికి బై, నిజాయితీ రాజకీయాలకు జై, పొలిటికల్ ఎంట్రీపై బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు