వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు నెలకొల్పింది. సుదీప్తోసేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు నుంచే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ చిత్రం, ఎన్ని ఆందోళనలు కొనసాగినా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. పెద్ద స్టార్లు నటించకపోయినా, భారీ బడ్జెట్ లేకపోయినా, ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.


ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘ది కేరళ స్టోరీ’ సరికొత్త రికార్డు


తాజాగా ‘ది కేరళ స్టోరీ’ చిత్రం వసూళ్ల విషయంలో కొత్త రికార్డును సాధించింది. ఇప్పటి వరకు కంగనా రనౌత్, అలియా భట్,  విద్యాబాలన్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలకు ఉన్నాయి. ప్రస్తుతం వీరి చిత్రాలను అధిగమించి ముందుకు దూసుకెళ్తోంది ఆదా శర్మ ‘ది కేరళ స్టోరీ’ మూవీ. తొలివారంలో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 81 నికర వసూళ్లు సాధించింది. బాలీవుడ్ చరిత్రలోనే  అత్యధికంగా ఓపెనింగ్ పొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది.   అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో మహిళలే కీలక పాత్రలు పోషించారు.  


ఆల్ టైమ్ హైయ్యెస్ట్ కలెక్షన్స్ చిత్రాలను వెనక్కిన నెట్టిన ‘ది కేరళ స్టోరీ’


కంగనా రనౌత్ నటించిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ చిత్రం 2015లో విడుదలై తొలి వారంలో రూ. 69.95 కోట్లు సంపాదించింది.  అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ గత కొద్ది నెలల క్రితం విడుదలై మొదటి వారంలో రూ. 68.83 కోట్ల నికర వసూళ్లను సాధించింది. కంగనా  మరో చిత్రం ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ మొదటి వారంలో  రూ. 57.95 కోట్లు సంపాదించింది. అలియా భట్ ‘రాజీ’ మొదటి ఐదు స్థానాల్లోకి ప్రవేశించింది.’ వీరే ది వెడ్డింగ్’ (రూ. 81 కోట్లు), ‘ది డర్టీ పిక్చర్’ (రూ. 80 కోట్లు),  ‘నీర్జా’ (రూ. 75 కోట్లు) లాంటి ఆల్ టైమ్ హైయ్యెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రాలను సైతం తాజాగా ‘ది కేరళ స్టోరీ’ అధిగమించింది. ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులను నెలకొల్పే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.    


Also Read : ప్రెగ్నెంట్ ఇలియానా - బేబీ బంప్ ఫుల్ ఫొటోస్ వచ్చేశాయ్!



సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం విడుదలకు ముందు నుంచి వివాదాల్లో చిక్కుకుంది. చాలా మంది ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఆందోళన చేశారు.  పశ్చిమ బెంగాల్‌లో ఈ చిత్రాన్ని నిషేధించగా, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్‌లో పన్ను మినహాయింపు ప్రకటించారు. ప్రధాని మోడీ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా, కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. ఈ చిత్రంలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా, విపుల్‌ అమృత్‌ లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు.  


Read Also: తప్పుడు వార్తలపై మలయాళీ స్టార్ హీరో తీవ్ర ఆగ్రహం, పరువు నష్టం దావా వేస్తున్నట్లు వెల్లడి