బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఆయన ఏది మాట్లాడినా క్షణాల్లో సంచలనం అవుతుంది. కాంట్రవర్శియల్ కామెంట్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. పవన్ కల్యాణ్ మీద ఈగ వాలినా సహించరు. పవర్ స్టార్ ను దేవుడిలా భావిస్తారు. సినిమాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాల మీద స్పందిస్తూ ఉంటారు. నచ్చిన వ్యక్తులను పొగడటం, నచ్చని వారిని తిట్టడం ఆయనకు కొత్తేమీ కాదు.


నిజానికి బండ్ల గణేష్  జనసేన పార్టీలోకి రావాలని పవన్ అభిమానుల చాలా రోజులగా కోరుకుంటున్నారు. కానీ, తాను రాజకీయాల్లోకి రానని బండ్లన్న చెప్తూ వచ్చారు. రాజకీయాల్లోకి వస్తే తిట్టాలి, తిట్టిచ్చుకోవాలి. అనవసరంగా కొంత మందికి దూరం కావాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. అన్ని పార్టీల్లో కావాల్సిన వాళ్లు ఉన్నారు. వారికి దూరం కావాడం ఇష్టం లేదన్నారు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు.


త్వరలో బండ్ల గణేష్ పొలిటిక్ ఎంట్రీ!


రాజకీయాల్లోకి వచ్చేది లేదని చెప్పిన గణేష్, మళ్లీ తన మనసు మార్చుకున్నారు. రాజకీయాల్లోకి రాబోతున్నట్లు హింట్ చ్చారు. రాజకీయ భవిష్యత్ పై త్వరలో  ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించింది. ’రాజకీయాలంటే నీతి, రాజకీయాలంటే నిజాయితీ, రాజకీయాలంటే కష్టం, రాజకీయాలంటే పౌరుషం. రాజకీయాలంటే శ్రమ, రాజకీయాలంటే పోరాటం. ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. అందుకే వస్తా’ అంటూ ట్వీట్ చేశారు.  అంతేకాదు. “నీతిగా, నిజాయితీగా నిబద్ధతగా, ధైర్యంగా, పౌరుషంగా, పొగరుగా, రాజకీయాలు చేస్తా. నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటా” అంటూ వరుస ట్వీట్లు చేశారు.














పవన్ కల్యాణ్ పార్టీలే చేరనట్లేనా?


రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన గణేష్, ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. చాలా మంది జనసేనలో చేరుతారని భావిస్తున్నారు. మరికొంత మంది ఏ పార్టీలో చేరబోతున్నారో చెప్పాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు గురించి పవన్ మాట్లాడిన తర్వాత, బండ్ల గణేష్ ఈ ట్వీట్స్ చేయడంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ట్వీట్స్ అన్ని పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగానే చేశారనే చర్చ నడుస్తోంది.  ఆయన పవన్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో చేరబోతున్నట్లు మరికొంత మంది చర్చించుకుంటున్నారు. ఆయన ప్రకటించే వరకు ఏ పార్టీ అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.


Also Read కంగనా రనౌత్, అలియా భట్ ను వెనక్కి నెట్టిన ఆదా శర్మ, బాక్సాఫీస్ దగ్గర ‘ది కేరళ స్టోరీ’ సరికొత్త రికార్డు!



2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన బండ్ల


వాస్తవానికి బండ్ల గణేష్ గతంలోనే తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అధికార టీఆర్ఎస్ పార్టీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్పారు బండ్ల. “లేదంటే, సెవెన్ ఏఎం బ్లేడ్ తో నాలుక కోసుకుంటా” అంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చి నవ్వులపాలయ్యారు. 2018 ఎన్నికల్లో ఓటమి నెమ్మదిగా రాజకీయాలకు దూరం అయ్యారు. మళ్లీ ఇప్పుడు రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించారు.   


Read Also: సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్న నజ్రియా - షాకింగ్ డెసిషన్