Karnataka Election Results 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఏబీపీ, సీ ఓటర్ సంయక్తంగా నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు వస్తున్నాయి. కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీ దిశగా ఉన్నట్టు ఉదయం ఎనిమిదిన్నర వరకు ఉన్న ట్రెండ్స్‌ను చూస్తే అర్థమవుతుంది. 



లెక్కింపు మొదలైన కాసేపటి వరకు కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడినట్టు కనిపించింది. ఆధిక్యాలు మారుతూ వచ్చాయి. మొదట ఇంటి నుంచి ఓటు వేసిన వారి ఓట్లను లెక్కించారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎంలలో ఉన్న ఓట్లు లెక్కించారు. 



ఓట్‌ ప్రమ్‌ హోం, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ బీజేపీ ఢీ అంటే ఢీ అన్నట్టు తలపడ్డాయి. మేజార్టీలు మారుతూ వచ్చాయి. ఎప్పుడైతే వందకుపైగా స్థానాల ట్రెండ్స్ రావడం మొదలైందో కాంగ్రెస్ దూసుకెళ్లడం ప్రారంభమైంది. బీజేపీ వెనుకబడుతూ వచ్చింది. 
ప్రభావం చూపలేకపోయిన జీడీఎస్‌
ముందుగా ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే జీడీఎస్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.