క్రిస్మస్‌కు షో షురూ అవుతుందని బీటౌన్ సెన్సేషనల్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranvir Singh) చెప్పారు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన సినిమా 'సర్కస్' (Cirkus Movie). ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయిక. ఈ రోజు సినిమా ఫస్ట్ లుక్ (Cirkus Movie First Look) విడుదల చేశారు. అలాగే, విడుదల తేదీ (Cirkus Movie Release Date) కూడా వెల్లడించారు. ఈ ఏడాది క్రిస్మస్‌కు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు చెప్పారు.
''మరోసారి ప్రేక్షకులను సినిమా హాళ్ళకు తీసుకు రావాల్సిన సమయం వచ్చింది. 16 ఏళ్ళ క్రితం 'గోల్ మాల్' విడుదలైంది. అప్పుడు మీరు చూపించిన ఆదరణ ఈ రోజు నన్ను ఇంతటి వాడిని చేసింది. మీకు, మీకు కుటుంబ సభ్యులకు క్రిస్మస్ గిఫ్ట్ ఈ 'సర్కస్'. ఎందుకంటే... 'సర్కస్'లో గోల్ మాల్ చాలా ఉంది'' అని దర్శకుడు రోహిత్ శెట్టి పేర్కొన్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
రణ్‌వీర్ సింగ్, రోహిత్ శెట్టి కలయికలో ఇంతకు ముందు 'సింబ' వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్ హిట్ సినిమా 'టెంపర్' కథకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆ సినిమా తెరకెక్కించారు. ఈసారి కంప్లీట్ కామెడీ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Also Read: తల్లి కాబోతున్న మరో హీరోయిన్, బర్త్ డేకి బేబీ బంప్‌తో...