Reaction on Pahalgam Attack: పహల్గాంపై ఉగ్రదాడి.. చిరు, బన్నీ, తారక్, రామ్ చరణ్, మంచు బ్రదర్స్, సాయి దుర్గా తేజ్ సహా సినీ సెలబ్రెటీస్ రియాక్షన్స్ !
ఇలాంటి ఘటనలు అవాంఛనీయం...చనిపోయినవారి కుటుంబాలకు భగవంతుడు శక్తిని అందించాలని ప్రార్థించారు టాలీవుడ్ సెలబ్రెటీలు. ఏం చేసినా వారులేని లోటు తీర్చలేం అంటూ చిరంజీవి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు
సుందరమైన పహల్గాంలో జరిగిన ఈ ఘటన నన్నెంతో కలిచివేసింది..నా గుండెముక్కలైందంటూ అల్లు అర్జున్ పోస్ట్ పెట్టాడు
ఈ దుర్ఘటన చూసి గుండెపగిలిపోయిందంటూ నాని ట్వీట్ చేశాడు
ఈ దాడి సంగతి తెలియగానే గుండె బద్దలైనట్టు అనిపించింది..టెర్రరిజంపై అంతా కలసి పోరాడాలి..మృతులకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని మనోజ్ పోస్ట్ పెట్టాడు
అక్కడ పోరాడిన సైనికులకు ధన్యవాదాలంటూ సాయి దుర్గా తేజ్ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టాడు
ఈ దుర్ఘటనపై రామ్ చరణ్, ఎన్టీఆర్, నాని, వరుణ్ తేజ్, సోనూ సూద్, మోహన్ బాబు సహా టాలీవుడ్ సెలబ్రెటీలంతా ఈ స్పందించి ఏమోషనల్ అయ్యారు