Just In





Chiranjeevi: ఇండస్ట్రీ అంతా ఒక్కటే కాంపౌండ్... బాలకృష్ణ, తారక్ అంటాడని విశ్వక్ ఫంక్షన్‌కు వెళ్లకూడదా? - చిరంజీవి
మెగా, నందమూరి కాంపౌండ్‌లని ప్రశ్నించిన మీడియాకు విశ్వక్ సేన్ క్లాస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్లాస్‌పై మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడారు. తాజాగా జరిగిన లైలా ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ హీరోయిన్లుగా నటించిన యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో పాటు, తాజాగా విడుదలైన ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ‘లైలా’ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం హైదరాబాద్‌లో మెగా మాస్ ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో..
కాంపౌండ్‌లపై విశ్వక్ సమాధానం అదిరింది
Chiranjeevi Speech at Laila Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఫంక్షన్లకు వచ్చేటప్పుడు కాస్త డల్‌గా వచ్చినా.. ఇక్కడున్న ఎనర్జీతో నాకు హుషారు వచ్చేస్తుంది. అందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ. ‘ఏంటి ఫంక్షనుందా? ఎవరు హీరో? ‘లైలా’ విశ్వక్సేన్ అంటే.. ఏంటి విశ్వక్ సేన్ ఫంక్షన్‌కి వెళుతున్నావా? ఏ.. ఎందుకు వెళ్లకూడదు? అంటే.. అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ, అప్పుడప్పుడు తారక్ అని అంటుంటాడు. అంటే మనుషులు అన్నాక వేరే వాళ్లపై ప్రేమ, అభిమానం ఉండకూడదా? నా మీద ఆప్యాయత ఉండకూడదా? మా ఇంట్లోనే.. మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అంతమాత్రాన.. వాడి ఫంక్షన్‌కి నేను వెళ్లకూడదా? వాడితో కలిసి భోజనం చేయకూడదా?. రీసెంట్‌గా మీడియా ఈవెంట్‌లో మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా.. చిరంజీవిని పిలుస్తున్నారేంటి? అని విశ్వక్‌ని అడిగిన క్లిప్ చూశాను. మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ.. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి కాంపౌండ్‌లు లేవు అని చాలా చక్కగా విశ్వక్ సమాధానం ఇచ్చాడు. అందుకు విశ్వక్‌ని అభినందిస్తున్నాను.
అందుకే హనీ హౌస్ ఏర్పాటు చేశాం
నిజంగా గిరి గీసుకుని.. ఏ హీరోకి ఆ హీరో అనే రోజులు ఒకప్పుడు ఉన్నాయి. లేవని చెప్పను. అది షూటింగ్‌ల వరకే. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోతారు. ఎవరి పనులు వారు చూసుకుంటారు. అలాంటి రోజుల్లో నేను ఉన్నాను. వాళ్లు అలా ఉండటం మూలంగా వారి మధ్య సఖ్యత ఉండదేమో అని, విభేధాలు ఉంటాయేమో అనే భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకునేవారు. వాల్ పోస్టర్స్ చించుకునేవాళ్లు. మా కజిన్స్ ఇద్దరు ఉండేవారు. వాళ్లు ఒకరు ఎన్టీఆర్‌గారి అభిమాని. ఇంకొకరు నాగేశ్వరావుగారి అభిమాని. నేను అప్పుడు చిన్నవాడిని.. వాళ్లిద్దరూ రక్తం వచ్చేసేటట్టు కొట్టేసుకుంటున్నారు. అప్పుడు నాకు భయం వేసేది. సినిమావాళ్లు బాగానే ఉంటారు.. వీళ్లు ఏంటి కొట్టుకుని చస్తున్నారు అని అనిపించేది. నేను ఫిల్మ్ యాక్టర్‌ని అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత, సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా అనిపించడానికి ఆ ఇన్సిడెంటే కారణం. అందుకనే మద్రాస్‌లో హనీ హౌస్‌లో అప్పట్లో అంతా కలుసుకునేవాళ్లం. అక్కడ అందరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్లం. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ఇలా అందరం కలుసుకునే వాళ్లం. అలాగే బాలకృష్ణ 50వ సినిమా ఓపెనింగ్‌లోనూ మేమంతా పార్టిసిపేట్ చేశాం. మా మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా అలా అందరం కలిసిపోయేవాళ్లం.
పవన్ కళ్యాణ్ గెలుపు, ‘పుష్ప 2’ సక్సెస్ గర్వంగా ఉంది
అభిమానం అంటారా అది పర్సనల్. నాకు ఒక రకం భోజనం నచ్చతుంది. ఇంకొకరికి ఇంకో రకం భోజనం రుచిస్తుంది. అలా ఒకరు ఇంకో యాక్టర్‌తో కనెక్ట్ అవుతుంటారు. అది మంచిదే.. దానిని యాక్సెప్ట్ చేయాలి. అంతేకానీ, విశ్వక్సేన్ మన మనిషి కాదు కాబట్టి.. అతను ఫంక్షన్‌కి పిలిస్తే వెళ్లకూడదు అని ఉండకూడదు. కచ్చితంగా వెళ్లాలి. అతను మన ఇండస్ట్రీ మనిషి. మనలో ఒకడు. మన కుటుంబ సభ్యుడు అనే మెసేజ్‌ని మనం పంపించాలి. మనం వారికి దూరంగా ఉండటం వల్ల మన ఇమేజ్ పెరుగుతుంది, మనకు ప్రత్యేక గుర్తింపు వస్తుందనే భావం కరెక్ట్ కాదు. మనకి ఫ్యాన్ బేస్ పెరగాలంటే.. అది మనం చేసే సినిమా కంటెంట్ ఇస్తుంది తప్ప.. మనల్ని మనం గిరిగీసుకుని కూర్చుంటే రాదు. అందరం కలివిడిగా ఉండాలి. మా ఇంట్లో హీరోలందరం కలిసి మెలిసి ఉంటాం. అలా అనీ మా ఇమేజ్‌లు తక్కువైపోతాయా? పవన్ కళ్యాణ్ ఏవీ కనబడగానే కేరింతలు వినబడ్డాయి. అందుకు నేను గర్విస్తాను. ‘పుష్ప2’ పెద్ద హిట్ అయింది.. బ్లాక్‌బస్టర్.. అందుకే నేను గర్విస్తాను.
హిట్‌తో వచ్చే డబ్బుల్ని మళ్లీ సినిమాలకే పెడతారు
ఒక్కోసారి సినిమాలు హిట్ అవ్వవచ్చు, అవ్వకపోవచ్చు కానీ, ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్ అయిందంటే.. ప్రతి ఒక్కరూ హర్షించాలి. ఒక సినిమా హిట్ అయిందంటే.. ఆ సినిమాపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది ఆధారపడి పనిచేసిన వాళ్లంతా హ్యాపీగా ఉంటారు. అలా హిట్టయిన సినిమాలకు వచ్చిన డబ్బులు ఎక్కడో పెట్టరు. మళ్లీ సినిమాలే తీస్తారు. ఈ సినిమా నిర్మాత సాహు ఇంతకు ముందు చేసిన మూడు సినిమాలకు మంచిగానే డబ్బులు వచ్చాయి. ఆ డబ్బు ఎక్కడో పెట్టడం లేదు.. మళ్లీ నాతోనే సినిమా చేస్తూ.. నాకే ఇస్తున్నాడు. నటీనటులకే ఇస్తున్నాడు. మళ్లీ సినిమా చేస్తూ.. ఎంతో మందికి జీవనాధారం కల్పిస్తున్నాడు. ‘భగవంత్ కేసరి’ సినిమాతో హిట్ కొట్టాడు కదా.. అని మనది అదే కాంపౌండ్ అనుకుంటే.. నాతో సినిమా ఎందుకు చేస్తాడు. నాకు అడ్వాన్స్ ఎందుకు ఇస్తాడు. అలా సినిమా చేయాలంటే అతనికి మంచి భవిష్యత్ ఉండాలని మాలాంటి వాళ్లు కోరుకోవాలి కదా. అందుకే ఇండస్ట్రీలోని వారంతా ఒక కుటుంబంలో ఉన్న రోజున ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకుంటారు. అంతా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందం పొందడం కోసం, ఆ ఆనందం ఇవ్వడం కోసం సాహు, విశ్వక్సేన్ నా దగ్గరకు రాగానే ఓకే చెప్పేశాను. ఇక ఆ కాంపౌండ్, ఈ కాంపౌండ్ అనే భేదాలు ఇక రావని అనుకుంటున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.