చైల్డ్ ఆర్టిస్ట్ గా 13 సినిమాల్లో నటించిన ఓ హీరో, ఆ తర్వాత టాలీవుడ్లో అమ్మాయిల కలల రాకుమారుడుగా మారాడు. హ్యాండ్సమ్ హీరోగా కనిపించే ఈ హీరో మంచి ఫేమ్ వచ్చిన తర్వాత, ఓ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించాడంటూ రూమర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం ఈ హీరో ఇండస్ట్రీలోనే కనిపించకుండా పోయాడు. అతను మరెవరో కాదు సీనియర్ హీరో తరుణ్.
చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ...
హీరో తరుణ్ తల్లి రోజా రమణి గొప్ప యాక్టర్. పాత సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించిన ఆమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా చెల్లిగా, ఫ్రెండ్ గా, అక్కగా పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో కూడా నటించారు. ఈ నేపథ్యంలోనే తరుణ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిన్న వయసులోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 'మనసు మమత' మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరుణ్ ఆ తర్వాత బుజ్జిగాడి బాబాయి, అంజలి, దళపతి, సూర్య ఐపిఎస్, అభయం, ఆదిత్య 369, మీరా, తేజ, పిల్లలు దిద్దిన కాపురం, రేపటి రౌడీ, జానీ, వజ్రం, విజయరామరాజు వంటి సినిమాల్లో నటించాడు.
ఇక 2000 ఏడాదిలో 'నువ్వే కావాలి' మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగు పెట్టాడు. ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. 'ప్రియమైన నీకు', 'నువ్వు లేక నేను లేను', 'నువ్వే కావాలి' వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరో స్టేటస్ అందుకున్నారు. నెక్స్ట్ వరుస సినిమాలతో కెరీర్ లో పీక్స్ చూసాడు తరుణ్. కానీ ఆ తర్వాత మాత్రం ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. తరుణ్ చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాఫ్ గా మిగిలాయి. కొన్నాళ్ల తర్వాత అసలు తరుణ్ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయి? ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియని పరిస్థితిలో పడిపోయాడు. 2018 లో రిలీజ్ అయిన 'ఇది నా లవ్ స్టోరీ' తరుణ్ చివరి సినిమా. ఆ మూవీ తర్వాత తరుణ్ పూర్తిగా ఫేడౌట్ అయిపోయాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న తరుణ్ బిజినెస్ లో బిజీగా ఉంటున్నాడు.
తరుణ్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఓ ప్రముఖ హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపించాడని రూమర్లు చక్కర్లు కొట్టాయి. సినిమాల్లో వాళ్లిద్దరి కెమిస్ట్రీ కూడా హాట్ టాపిక్ అయ్యింది. కొన్నాళ్ళు అంతా బావుంది. బ్రేకప్ జరిగి ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయ్యారు. అయితే... ఆమె రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఆ లవ్, ఎఫైర్ మరోసారి వార్తల్లో వచ్చింది అప్పట్లో. ఆ తర్వాత ఆవిడ బరువు తగ్గడం కోసం, మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని లైపో సక్షన్ ఆపరేషన్ చేయించుకుంది. అది వికటించడంతో మరణించింది. ఇప్పటికీ తరుణ్ పెళ్లి చేసుకోలేదు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో తరుణ్ కూడా ఒకరు. ఇప్పటిదాకా ఆయన పెళ్లి చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే తరచుగా తరుణ్ పెళ్లి గురించిన వార్తలు తెరపైకి వస్తూ ఉంటాయి. కానీ ఆయన తల్లి రోజా రమణి మాత్రం ఈ వార్తలను చాలా కూల్ గా తీసుకుంటుంది. రీసెంట్ గా మెగా ఫ్యామిలీకి తరుణ్ అల్లుడు కాబోతున్నాడని, మెగా డాటర్ నిహారికను పెళ్లాడబోతున్నాడని రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తరుణ్ సినిమాలకు దూరమైన తర్వాత తనపై వచ్చే రూమర్స్ ను కూడా పట్టించుకోవట్లేదు.
Also Read: నన్నొక క్రిమినల్‌లా ట్రీట్ చేశారు... సమంతతో విడాకులపై నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్