జాతీయ పురస్కార గ్రహీత ధనుష్ (Dhanush) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్' (Captain Miller Movie). ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్. సత్య జ్యోతి ఫిల్మ్స్ సంస్థలో టి.జి. త్యాగరాజన్ సమర్పణలో సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. డిసెంబర్ 15న సినిమాను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
సౌత్ ఇండియాలో 3500 థియేటర్లలో...
ఆగస్టు 10 నుంచి 'కెప్టెన్ మిల్లర్' టీజర్ సౌత్ ఇండియాలోని 3500 థియేటర్లలో ప్రదర్శించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో సినిమాను తెరకెక్కించారు. కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. అన్ని భాషలకు టీజర్ చేరువ అయ్యేలా భారీ ఎత్తున థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు.
ధనుష్ ట్రిపుల్ రోల్...
'కెప్టెన్ మిల్లర్' సినిమాలో ధనుష్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. ఆయన మూడు క్యారెక్టర్ల పేర్లు... మిల్లర్, ఈశ, అనలీశ! బ్రిటీషర్స్ దగ్గర ఆయుధాలు తస్కరించి వాళ్ళపై పోరాటం చేసిన యోధుడి తరహాలో ఓ పాత్ర ఉంటుందని సమాచారం.
'కెప్టెన్ మిల్లర్' టీజర్ నిడివి 100 సెకన్స్ లోపు మాత్రమే! అయితేనేం... సినిమాలో ప్రధాన పాత్రలు అన్నిటినీ చూపించారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా కొందరు భారతీయులు చేసిన స్వాతంత్య్ర పోరాటమే చిత్రకథ అని అర్థం అవుతోంది. గొడ్డలితో ఒకరి మీద ధనుష్ చేసిన దాడి అయితే అరాచకం అంతే! తుపాకీతో తూటాలు విదిల్చిన తీరు కూడా అమోఘం. కథానాయిక ప్రియాంకా అరుళ్ మోహన్, సందీప్ కిషన్, శివ రాజ్ కుమార్ క్యారెక్టర్లు కూడా పరిచయం చేశారు.
Also Read : త్వరలో విజయ్ దేవరకొండ పెళ్లి - 'ఖుషి' ట్రైలర్ లాంచ్‌లో రౌడీ బాయ్ ఏం చెప్పారంటే?
హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్!
హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా 'కెప్టెన్ మిల్లర్' తెరకెక్కుతోంది. ఇందులో ధనుష్ ఫస్ట్ లుక్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. యుద్ధ భూమిలో గన్ పట్టుకుని నడుస్తున్న ఆయన లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ''ఫ్రీడమ్ అంటే రెస్పాక్ట్'' అని ఫస్ట్ లుక్ (Captain Miller First Look)కి ధనుష్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్ర కథ 1930 - 40ల నేపథ్యంలో సాగుతోందని నిర్మాతలు తెలిపారు. ధనుష్ కెరీర్‌లో భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతున్న చిత్రమిది.
Also Read : మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న 'కెప్టెన్ మిల్లర్' సినిమాలో యువ తెలుగు హీరో సందీప్ కిషన్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్, నివేదితా సతీశ్, జాన్ కొక్కెన్, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్, వినోద్ కిషన్, నాజర్, విజి చంద్రశేఖర్, బాల శరవణన్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : టి. రామలింగం, కూర్పు : నాగూరన్, ఛాయాగ్రహణం : శ్రేయాస్ కృష్ణ, సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థ : సత్య జ్యోతి ఫిల్మ్స్, సమర్పణ : టీజీ త్యాగరాజన్, నిర్మాతలు : సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, రచన & దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial