మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి ఎలాంటి క్రేజ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సుమారు 30 దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా వెలుగొందుతూ కొన్ని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సినీ పరిశ్రమలోకి వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఆయన సినిమా విడుదలైందంటే ఆ రోజు అభిమానులకు పండగే. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ, విదేశాల్లోనూ మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా చైనాలో మెగాస్టార్ క్రేజ్ కి నిదర్శనంగా ఓ సంఘటన చోటు చేసుకుంది.


చైనా రాజధాని బీజింగ్ లోని జంజో 26 అనే గవర్నమెంట్ మిడిల్ స్కూల్లో ఓ టీచర్ స్టూడెంట్స్ కి ''మీకు నచ్చిన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి ఒక ఆడియో ప్రజెంటేషన్ ఇవ్వండి'' అంటూ అసైన్మెంట్ ఇచ్చింది. ఆ స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న జస్మిత అనే తెలుగు అమ్మాయి మెగాస్టార్ చిరంజీవి మీద ఆడియో విజువల్ ఇస్తానని చెప్పిందట. దాంతో టీచర్ who Is Chiranjeevi? అని అడిగితే, google లోకి వెళ్లి మెగాస్టార్ విశ్వరూపాన్ని చూపించిందట జస్మిత. అయితే విదేశీయులను, ముఖ్యంగా భారతీయులను ఇన్స్పిరేషన్ గా చెప్పడానికి అక్కడ అనుమతించరట. కానీ జస్మిత ఇచ్చిన వివరాల ప్రకారం గూగుల్ లో సర్చ్ చేసి చిరంజీవి గురించి తెలుసుకున్నాక ఆశ్చర్యపోతూ ''He is Really Inspiring.. Go Ahead'' అని పర్మిషన్ ఇచ్చిందట టీచర్.


దాంతో జస్మిత చిరంజీవి గురించి ఐదు నిమిషాల విజువల్ రూపొందించి ప్రదర్శించడమే కాకుండా క్లాస్ రూమ్ లో ఆయన గురించి అనర్గళంగా మాట్లాడి అందరి చేత అభినందనలు అందుకుంది. దీంతో తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ జస్మిత ఎవరంటే? మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో డాన్స్ నేర్చుకుని ఎన్నో డాన్స్ కాంపిటీషన్లో ఫైనలిస్ట్ గా నిలిచి.. ఆపై చైనా వెళ్లి అక్కడ డాన్స్ ఇన్స్టిట్యూట్స్ స్థాపించి ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ గా ఎదిగిన అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్ కూతురే ఈ జస్మిత. విజయ్, అతని భార్య జ్యోతి ఇద్దరూ డాన్స్ లోనూ, యోగాలోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఏకైక జంటగా రికార్డ్ సృష్టించారు. అలా మెగాస్టార్ క్రేజ్ ఎల్లలు దాటి విశ్వవ్యాప్తం కావడం ఎంతో అభినందనీయం అని చెప్పొచ్చు.


కాగా గతంలో ఓ టీవీ షోలో ప్రసారమైన డాన్స్ షోలో విజయ్ బృందం ఫైనల్ వరకు వెళ్లి విజయం సాధించగా... ఆ రోజు ఫైనల్ ట్రోఫీని చిరంజీవి చేతుల మీదుగా అందుకోవాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలవల్ల అది కుదరలేదు. దీంతో విజయ్ కి తన అభిమాన హీరోని కలిసి ఛాన్స్ మిస్సయింది. ఇదే ఈ విషయాన్ని విజయ్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో పలు టీవీ చానల్స్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ విషయం మెగాస్టార్ దృష్టికి వెళ్లడంతో విజయ్ ని తన ఇంటికి ఆహ్వానించాలని చిరంజీవి అనుకున్నారు. కానీ అప్పటికే విజయ్ మళ్ళీ చైనా వెళ్లిపోయారు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఇండియా తిరిగి వచ్చాక విజయ్ ని చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు. అప్పుడు విజయ్ చిరంజీవి ఇంటికి భార్య పిల్లలతో వెళ్లి అక్కడే రెండు రోజులపాటు ఉన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా అప్పట్లో ఎంతో వైరల్ అయ్యాయి.


Also Read : రీ-రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ప్రభాస్ ప్లాప్ మూవీ ‘యోగి’ - ఎప్పుడంటే?







Join Us on Telegram: https://t.me/abpdesamofficial