పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటిస్తున్న సినిమా 'బ్రో'. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య'లో ఆడి పాడారు. ఆ తర్వాత అఖిల్ అక్కినేనితో కలిసి 'ఏజెంట్'లో స్టెప్పులు వేశారు. తెలుగులో ఆమెకు మూడో స్పెషల్ సాంగ్ ఇది.
పబ్బులో పవన్ - ఊర్వశి సాంగ్!
హైదరాబాద్ సిటీలో ఓ స్టూడియోలో 'బ్రో' స్పెషల్ సాంగ్ కోసం ఓ పబ్ సెట్ వేశారు. ఈ రోజు (జూన్ 6న) ఊర్వశి రౌతేలా షూటింగులో జాయిన్ అవుతారని తెలిసింది. ఈ సాంగ్ పెప్పీగా ఉంటుందని, సినిమా హైలైట్స్ లో ఒకటి అవుతుందని తెలిసింది. అంతే కాదు... ఈ సాంగ్ కోసం నిర్మాతలు కాస్త గట్టిగా ఖర్చు చేస్తున్నారు.
ఊర్వశి రౌతేలా ఒక్కో పాటకు మినిమమ్ 50 లక్షల రూపాయలు తీసుకుంటారని టాక్. ఆవిడ రెమ్యూనరేషన్ కంటే నాలుగైదు రేట్లు పాట కోసం ఖర్చు పెడుతున్నారట. సెట్ దగ్గర నుంచి లైటింగ్ వరకు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదని తెలిసింది.
ఒక్క రోజు లైటింగ్ కోసమే 75 లక్షలు!
పవన్ కళ్యాణ్, ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్‌లో లైటింగ్ హైలైట్ అవుతుందని చిత్ర బృందం సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం. లైటింగ్ కోసమే 75 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అది ఎలా ఉంటుందో సినిమా విడుదలైన తర్వాత తెలుస్తుంది. ఎలా లేదన్నా ఈ పాట కోసం సుమారు 5 కోట్లు ఖర్చు అవుతుందని టాక్. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' సినిమాలకు సంగీత సంచలనం తమన్ అందించిన పాటలు అభిమానులకు నచ్చాయి. మరోసారి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఆయన మ్యూజిక్ ఇస్తున్నారట.
'బ్రో' స్పెషల్ సాంగులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్... ఇద్దరితోనూ ఊర్వశి రౌతేలా స్టెప్పులు వేయనున్నారు. అమితాబ్ బచ్చన్, ఆయన తనయుడు అభిషేక్, ఐశ్వర్య స్టెప్పులు వేసిన 'ఖజారారే... ఖజారారే...' తరహాలో ఈ సాంగ్ ఉంటుందట. ఆల్రెడీ విడుదల చేసిన స్టిల్స్ చూస్తే... పవన్ కళ్యాణ్ షూస్ హైలైట్ అయ్యాయి. లక్షల రూపాయల ఖరీదు చేసే షూలను ఆయన కోసం తెప్పించారు.
Also Read : మహేష్ బాబు వెళ్ళింది ఎవరి ఫంక్షన్‌కో తెలుసా? మధ్యలో అఖిల్ ఎందుకొచ్చాడు?
ప్రపంచవ్యాప్తంగా జూలై 28న విడుదల!
ప్రముఖ నటుడు, ఇంతకు ముందు తెలుగులో మాస్ మహారాజా రవితేజ 'శంభో శివ శంభో', నాని 'జెండా పై కపిరాజు' చిత్రాలకు దర్శకత్వం వహించిన సముద్రఖని 'బ్రో' మూవీకి దర్శకుడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జూలై 28న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ (Ketika Sharma) కనిపించనున్నారు. ఆయన కంటే ముందు తమ్ముడు వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో ఆమె నటించారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర చేస్తున్నారు.
Also Read : ఉదయ భాను రీ ఎంట్రీ - 'ఆగస్టు 6 రాత్రి' ఏం జరిగింది?