Mammootty's Malayalam Blockbuster Bramayugam, A Psychological Horror Thriller will be releasing in Telugu on 23rd February: లెజెండరీ యాక్టర్, మన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'భ్రమయుగం'. ఇదొక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాటులో రూపొందించారు. ఆల్రెడీ మలయాళ భాషలో విడుదలైంది. విమర్శకుల నుంచి మంచి ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణతో భారీ వసూళ్లు సాధిస్తోంది. త్వరలో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.


తెలుగులో ఈ నెల 23న 'భ్రమయుగం' విడుదల
భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా కొందరు హీరోలు తమ నటనతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంటారు. అలాగే, మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అటువంటి వారిలో మమ్ముట్టి ఒకరు. అందుకని, ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'భ్రమయుగం' తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.


నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్‌ పతాకాలపై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ నిర్మించిన 'భ్రమయుగం' సినిమాను తెలుగులో ఈ నెల 23న విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తోంది.


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను నిర్మిస్తున్న సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 'లియో' తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆయన విడుదల చేస్తున్న చిత్రమిది.


Also Read: యువ దర్శకుడికి అవకాశం ఇస్తున్న బాలకృష్ణ - నానికి హిట్ ఇచ్చినోడితో?






మమ్ముట్టితో పాటు 'భ్రమయుగం' సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ అద్భుతంగా నటించారు. రచయిత - దర్శకుడు రాహుల్ సదాశివన్, సినిమాటోగ్రాఫర్ షెహనాద్ జలాల్, ఆర్ట్ డైరెక్టర్ జోతిష్ శంకర్, సంగీత దర్శకుడు క్రిస్టో జేవియర్, ఎడిటర్ షఫీక్ మహమ్మద్ అలీ, సౌండ్ డిజైనర్ జయదేవన్ చక్కాడత్, ఫైనల్ మిక్స్ ఇంజనీర్ ఎం.ఆర్. రాజాకృష్ణన్... ఇలా చిత్ర బృందమంతా మనసుపెట్టి పనిచేసి, సమిష్టి కృషితో అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు.


Also Readభ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్... మరి సినిమా? లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?





'భ్రమయుగం' చిత్రానికి కాస్ట్యూమ్స్: మెల్వీ జె, మేకప్: రోనెక్స్ జేవియర్, కూర్పు: షఫీక్ మహమ్మద్ అలీ, కళా దర్శకుడు: జోతిష్ శంకర్, ఛాయాగ్రహణం: షెహనాద్ జలాల్,మాటల రచయిత: టి.డి. రామకృష్ణన్, సంగీతం: క్రిస్టో జేవియర్, నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర - ఎస్.శశికాంత్, రచన - దర్శకత్వం: రాహుల్ సదాశివన్.