Varun Dhawan - Natasha Dalal Shared Good news: వరుణ్ ధావన్.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ హీరో. మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ హీరో అభిమానులతో ఒక గుడ్ న్యూస్ పంచుకున్నారు. తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించారు. ఒక క్యూట్ ఫొటోను షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటో వైరల్ అవుతోంది. అభిమానులు ఆ పోస్ట్ కింద తెగ కామెంట్లు పెడుతున్నారు. విషెస్ చెప్తున్నారు.
స్పెషల్ ఫొటో..
తను తండ్రి కాబోతున్నట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా చెప్పారు వరుణ్ ధావన్. తన భార్య బేబీ బంప్ ను ముద్దుపెట్టుకుంటూ.. మేం తల్లిదండ్రులం కాబోతున్నాం. మీ ఆశిర్వాదాలు, మీ ప్రేమ కావాలి అంటూ పోస్ట్ పెట్టారు ఆయన. ఇక ఈ పోస్ట్ చూసిన సెలబ్రిటీలు, ఆయన అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇక వరుణ్ ధావన్ కి టాలీవుడ్ యాక్టర్ సమంత కూడా విషెస్ చెప్పారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. కరణ్ జోహార్, జాన్వీ కపూర్, మౌని రాయ్, వాణి కపూర్, భూమి పెడ్నేకర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, రాశి ఖన్నా, మానుషి చిల్లర్, మనీష్ పాల్ కాబోయే తల్లిదండ్రులను అభినందించారు. వరుణ్ ముంబైలోని తన నివాసంలో ఈ ఫొటో షూట్ జరిపారు. ఆ ఫొటోలో వాళ్లపెట్ కూడా ఫోజులిచ్చింది.
వరుణ్ ధావన్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ ను 2021లో పెళ్లిచేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆ తర్వాత అదిప్రేమగా మారంది. చాలా సంవత్సరాలు డేటింగ్ తర్వాత సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లైన మూడేళ్లకు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందనున్నారు వరుణ్, నటాషా. ఇక నటాషా ముంబైలో ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్. ఆమెకు ప్రత్యేకంగా ఒక లేబుల్ కూడా ఉంది. వరుణ్ తో ప్రేమ గురించి ఆమె మాట్లాడుతూ.. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని, 20 ఏళ్లు వచ్చేవరకు ఫ్రెండ్సే అనుకున్నామని, కానీ.. ఆ తర్వాతే వాళ్ల మధ్య బంధం అంతకుమించి అని తెలిసిందని చెప్పారు.
వరుణ్ ధావన్.. గతేడాది 'బవాల్' చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో జాన్వీ కపూర్ జోడీగా నటించారు. డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కింది. ఇక వరుణ్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తోన్న 'బేబీ జాన్' చిత్రంలో కనిపించనున్నారు. మరోవైపు 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్‌లో సమంతతో కలిసి నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు రాజ్, డీకే దర్శకత్వం వహిస్తున్నారు. మే 31న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న 'స్త్రీ - 2' అనే హారర్ సినిమాలో నటిస్తున్నారు.
Also Read: కలెక్షన్స్ వసూళ్లలో ‘ఈగల్’ ఢమాల్ - రవితేజను వెంటాడుతోన్న ఫ్లాప్స్, నష్టం ఎంతంటే?