Venu Swamy latest news: వేణు స్వామి అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ, ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Astrologer Venu Swamy) అని చెబితే మెజారిటీ తెలుగు ప్రేక్షకులు వెంటనే గుర్తు పడతారు. సోషల్ మీడియాలో ఆయన అంత పాపులర్. అగ్ర హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లో రాబోయే రోజుల్లో ఇలా జరుగుతుందని, సదరు తారల జాతకాలు చెబుతూ తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులకు, అభిమానులకు సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యారు. ఇప్పుడు ఆయన క్రేజ్ ఏ స్థాయికి చేరిందంటే... ఆయన చేతుల మీదుగా షార్ట్ ఫిల్మ్ అవార్డులు ఇప్పించేంతగా!


టీ హబ్‌లో సందడిగా టీఎస్ఎఫ్ఏ అవార్డ్స్!
తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్... టీఎస్ఎఫ్ఏ 2023 అవార్డుల కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని మాదాపూర్ టి హబ్‌లో జరిగింది. ఆ కార్యక్రమానికి జ్యోతిష్యుడు వేణు స్వామి, సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీజీ వింద హాజరు అయ్యారు. ఆ ఇద్దరూ జ్యోతి ప్రజల్వన చేసి అవార్డుల వేడుకను ఆరంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తరపున యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అవార్డులను ప్రదానం చేయడంతో పాటు టీఎస్ఎఫ్ఏ 2024 (తెలుగు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్) పోస్టర్ కూడా ఆవిష్కరించారు.


సోషల్ మీడియాలో క్రేజ్ పెరిగింది!
Venu Swamy about Social Media influencers: షార్ట్ ఫిల్మ్ అవార్డులు ప్రదానం చేసిన అనంతరం వేణు స్వామి మాట్లాడుతూ... ''ఇప్పుడు మీడియా మాధ్యమాలతో పాటు సోషల్ మీడియాకు ఎంతో క్రేజ్ పెరిగింది. ఎంటర్‌టైన్‌మెంట్, కామెడీ, టాలెంట్... ఇలా వివిధ రంగాల్లో తమ ప్రతిభను ఇతరులకు తెలిసేలా చేయడంలో సోషల్ మీడియా యువతకు ఎంతో హెల్ప్ అవుతోంది. స్టోరీ మేకింగ్ సహా ఎన్నో విషయాల్లో ఇప్పుడు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో నేటి యువత స్టార్లుగా ఎదగడంతో పాటు స్వయం ఉపాధి కూడా పొందుతున్నారు'' అని చెప్పారు. సోషల్ మీడియా స్టార్లకు మరింత ప్రోత్సాహం అందించేందుకు కళారాజ్ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత శ్రీనివాస్ ఆరేళ్లుగా ఈ అవార్డులను అందించడం అభినందనీయం అని ఆయన ప్రశంసలు కురిపించారు.


Also Readభ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్... మరి సినిమా? లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?






ఇంకా ఈ వేడుకలో తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్, తెలుగు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ నిర్వహకులు కళారాజ్ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత శ్రీనివాస్ మర్రి మాట్లాడుతూ... ''ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నెటిజనుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ దూసుకు వెళుతున్న యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్ప్లూయెన్సర్లకు వివిధ క్యాటగిరిలో అవార్డులు ఇచ్చాం. త్వరలో తెలుగు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కూడా నిర్వహిస్తాం'' అని చెప్పారు.


Also Read: అమెరికాలో ఉంటూ ఇండియాలో సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు - 'ఇంద్రాణి' ట్రైలర్ లాంచ్‌లో అనిల్ సుంకర