యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) నటించిన తాజా సినిమా 'బెదురులంక 2012'. ఆగస్టు 25న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సినిమా విడుదలకు... సుమారు నెల ముందు బిజినెస్ అంతా క్లోజ్ అయ్యింది. ఈ తరుణంలో, కొవిడ్ తర్వాత కాలంలో యంగ్ హీరోల సినిమాలు అరుదుగా ఈ టైప్ ఫీట్ నమోదు చేస్తున్నాయి. 


ఐదు కోట్లకు 'బెదురులంక 2012' థియేట్రికల్ రైట్స్
Bedurulanka 2012 movie pre release business : 'బెదురులంక 2012' ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు కోట్ల రూపాయలకు జరిగినట్లు తెలిసింది. ఈ సినిమా నైజాం, ఆంధ్ర  డిస్ట్రిబ్యూషన్ హక్కులు శంకర్ పిక్చర్స్ కొనుగోలు చేసింది. సీడెడ్ రైట్స్ శ్రీ ధనుష్ ఫిలిమ్స్, ఓవర్సీస్ రైట్స్ ది విలేజ్ గ్రూప్ తీసుకున్నాయి. 


ఆగస్టులో సినిమా ట్రైలర్ విడుదల!
క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్న 'బెదురులంక 2012' సినిమాను లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మించారు. 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించారు. ఆగస్టు తొలి వారంలో సినిమా ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఆల్రెడీ రెండు పాటలు విడుదల చేశారు. వాటికి లభిస్తున్న స్పందన పట్ల దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.


Also Read : అనుష్క ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - అనుకున్నదే జరిగింది!



నువెవడివి? సొల్లుడా శివా!
''భోగమంత యిడువనే యిడువవు వింతగుంది రా... 
నువెవడివి సొల్లుడా శివా...  నువెవడివి సొల్లుడా శివా...  
లోకమన్న లెక్కలకు అందవు గొప్పగుంది రా... 
నువెవడివి సొల్లుడా శివా...  నువెవడివి సొల్లుడా శివా...''
అంటూ సాగిన గీతాన్ని ఇటీవల విడుదల చేశారు. 


మెలోడీ బ్రహ్మ మణిశర్మ మాంచి బాణీ అందించగా... 'సొల్లుడా శివా' పాటకు కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి, రోల్ రైడ, పృథ్వీ చంద్ర ఆలపించారు. లిరికల్ వీడియో చూస్తే... కార్తికేయ హుషారుగా స్టెప్పులు వేసినట్లు అర్థం అవుతోంది. అలాగే, లిరిక్స్ ద్వారా పాటకు ఫిలాసఫీ టచ్ కూడా ఇచ్చారు. 


Also Read 'స్లమ్ డాగ్ హజ్బెండ్' రివ్యూ : కుక్కతో పెళ్లి అయితే - సినిమా ఎలా ఉందంటే?


ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే సినిమా 'బెదురులంక 2012' అని నిర్మాత బెన్నీ ముప్పానేని తెలిపారు. ఇప్పటి వరకు గోదావరి నేపథ్యంలో వచ్చిన రూరల్ డ్రామాలకు ఇది చాలా భిన్నంగా ఉంటుందని, గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' అనేలా బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని ఆయన చెప్పారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ అని, ప్రేక్షకులని ఈ సినిమా కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు.


అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, నృత్యాలు: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial