నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) అస్వస్థతకు గురైన క్షణం నుంచి ఆయనను బెంగళూరు తీసుకువెళ్లే వరకు... అక్కడ ఆస్పత్రిలో బాగోగులు చూసుకోవడం దగ్గర నుంచి అంతిమ కార్యక్రమాలు పూర్తి అయ్యే వరకు... కన్న తండ్రి కంటే ఎక్కువగా బాలకృష్ణ (Nandamuri Balakrishna) చూసుకున్నారు. ఆయన గురించి విజయసాయి రెడ్డి కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పుడు తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి పోస్ట్ చూసినా ఆ విషయం అర్థం అవుతుంది. 


బాలకృష్ణ ఒక్కరే...
''మంచి చెడుల్లో మాకు అండగా, కొండలా.... చివరి వరకు మా వెంట నిలబడింది ఒక్కరే. మేం కుటుంబం అని పిలిచేది ఒక్కరినే (బాలకృష్ణను). ఓ తండ్రిలా తారక రత్నను ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు.  ఆస్పత్రిలో బెడ్ పక్కన కూర్చుని ఓ తల్లిలా పాటలు పాడి వినిపించారు. తారక రత్న రియాక్ట్ అవ్వాలని జోక్స్ వేసేవారు. చుట్టు పక్కల ఎవరూ లేనప్పుడు... ఒంటరిగా కన్నీరు పెట్టుకునేవారు. ఆయన ఎప్పుడూ మా వెంట ఉన్నారు. ఓబు (తారక రత్నను కుటుంబ సభ్యులు పిలిచే పేరు)... నువ్వు ఇంకొన్ని రోజులు ఉండాల్సింది. నిన్ను మేం బాగా మిస్ అవుతున్నాం'' అని అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేశారు. ఫోటో ఎడిట్ చేసిన వాళ్ళకు థాంక్స్ చెప్పారు. 


బాలకృష్ణ ఒక్కరే తమ కుటుంబం అని చెప్పడంలో అలేఖ్యా రెడ్డి ఉద్దేశం ఏమిటి? అని ప్రజల్లో కొత్త సందేహాలకు ఆస్కారం ఇచ్చినట్లు అయ్యింది. తారక రత్న, అలేఖ్యా రెడ్డిది ప్రేమ వివాహం. తొలుత ఇరువురి కుటుంబ సభ్యులు పెళ్ళికి అంగీకరించలేదు. అందువల్ల, నిరాడంబరంగా ఒక్కటి అయ్యారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు దగ్గర అయ్యారు. 


Also Read : ఆస్కార్స్‌లో సత్తా చాటిన ఏసియన్లు - హాలీవుడ్ బడా దర్శకులకు చుక్కెదురు






ఈ ఏడాది ఫిబ్రవరి 18న తారక రత్న కన్నుమూశారు. ఫిబ్రవరి 22న ఆయన పుట్టిన రోజు. దానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు ఆయన కాలం చేశారు. తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. భర్తను తలుచుకుని ఎమోషనల్ అవుతున్న అలేఖ్యా రెడ్డి, అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తన భర్తను ఎవరూ అర్థం చేసుకోలేదని ఆమె పోస్ట్ చేశారు. 


తారకరత్నను ఎవరూ అర్థం చేసుకోలేదు!
జీవితంలో కష్టాలు పడుతూనే తాము ఇంత దూరం వచ్చామని అలేఖ్యా రెడ్డి లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. జీవితంలో కష్టసుఖాలు చూశామని, వరస్ట్ మూమెంట్స్ ఫేస్ చేశామని ఆమె తెలిపారు. ''నువ్వు, నేను కలిసి మంచి రోజుల కోసం ఎదురు చూశాం. మనకు చిన్న కుటుంబాన్ని క్రియేట్ చేసుకున్నాం'' అని అలేఖ్యా రెడ్డి పేర్కొన్నారు. ఆ తర్వాత ''నిజమైన తారక రత్న ఎవరికీ తెలియదు. తారక రత్నను ఎవరూ అర్థం చేసుకోలేదు. నిన్ను నేను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. బాధను గుండెల్లో దాచుకుని మాకు ప్రేమను పంచావు. మన చుట్టూ ఎన్ని అబద్దాలు ప్రచారంలో ఉన్నా నేను ధైర్యంగా నిలబడతా. నిన్ను ఈ రోజు మేం మిస్ అవుతున్నాం'' అని అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేశారు.


Also Read : ఆస్కార్ తెచ్చిన రాజమౌళి - దర్శక ధీరుడికి చరిత్ర సలామ్ కొట్టాల్సిందే