క్కినేని నాగ చైతన్య హీరోగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా 'కస్టడీ'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధమైంది. చైతన్యకు ఇది తొలి స్ట్రయిట్ తమిళ చిత్రం. ఇటీవలే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అందులోని యాక్షన్ సీన్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో చైతన్య సోమవారం మరో అప్‌డేట్ ఇచ్చాడు. అయితే, దీనికి ముందు చైతూ తన సోషల్ మీడియా అకౌంట్లలో బ్లూ కలర్‌లో ఉన్న తన ఫొటోలను అప్‌లోడ్ చేశాడు. దీంతో ఆయన అభిమానులు.. ప్రొఫైల్ పిక్ ఎందుకు ఆ కలర్‌లో ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు సమాధానంగా చైతూ.. టీజర్ టీజ్‌ను వదిలారు. 






ఇదేంటీ టీజ్? అని అనుకుంటున్నారా? అదేనండీ.. టీజర్ రిలీజ్ తేదీన ప్రకటించే వీడియోనే చైతూ.. ‘టీజ్’ అని పిలిచాడు. కట్ చేస్తే.. ఓ పెద్ద నది, ఆ నది అడుగుకు వెళ్లిన తర్వాత అందులో ఒక లాకప్ తరహా బాక్సు ఉంటుంది. అందులో బంధీగా ఉన్న చైతూ.. దాని నుంచి బయటకు వస్తాడు. ఇక వెయింట్ చేయక్కర్లేదంటూ టీజర్ తేదీని ప్రకటించారు. ‘కస్టడీ’ టీజర్‌ను మార్చి 16న విడుదల చేయనున్నట్లు ఈ టీజర్ టీజ్ ద్వారా వెల్లడించారు. 



‘కస్టడీ’లో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్‌ పాత్ర చేస్తున్నారు. సినిమాలో ఆయన పేరు A.చైతన్య. A అంటే అక్కినేని అయ్యి ఉంటుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... తోటి అధికారులు ఆయన్ను కదలకుండా తమ చేతుల్లో ఎందుకు బంధించారనేది సస్పెన్స్. సాధారణంగా పోలీసులు ఖైదీలను కస్టడీలోకి తీసుకుంటారు. అయితే, ఇక్కడ పోలీస్ ఆఫీసర్‌నే తోటి సిబ్బంది ఎందుకు కస్టడీలోకి తీసుకుంటారనేది వెండి తెరపైనే చూడాలి. 


మే 12న విడుదల






నాగ చైతన్య, వెంకట్ ప్రభు కలయికలో సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది. మే 22న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. నాగ చైతన్యకు జోడీగా ఈ సినిమాలో కృతి శెట్టి (Krithi Shetty) నటిస్తున్నారు. ఈ ఇద్దరిదీ సూపర్ హిట్ జోడీ. వీళ్ళిద్దరూ సూపర్ హిట్ సినిమా 'బంగార్రాజు'లో సందడి చేశారు. ప్రేక్షకులు, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు ఈ వీడియో బాగా నచ్చింది. 'తడాఖా' సినిమాలో నాగ చైతన్య కొన్ని సన్నివేశాల్లో పోలీసుగా కనిపిస్తారు. కానీ, పోలీస్ కాదు. అసలు పోలీస్ సునీల్.


Also Read : ఆస్కార్ గొడవ - ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఎందుకు, రామ్ చరణ్ ఎక్కడ? మెగా ఫ్యాన్స్ ఫైర్