'ఆర్ఆర్ఆర్' (RRR Movie) సినిమలో 'నాటు నాటు...' (Naatu Naatu Song) పాటకు ఆస్కార్ రావడంతో యావత్ దేశం అంతా సంబరాలు చేసుకుంటోంది. చిత్రసీమ ప్రముఖుల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, చిత్ర బృందంలోని ఇతర సభ్యుల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రపంచ సినిమా వేదికపై మన పాటకు గొప్ప గౌరవం దక్కడంతో తెలుగు సినిమా ప్రజలు అందరూ గర్వంగా ఉన్నారు. అయితే, ఒక్క విషయంలో మెగా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్స్ మీద ఫైర్ అవుతున్నారు. వాళ్ళ కోపానికి కారణం ఏమిటి? ఎందుకీ అలక? అంటే...
 
ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఎందుకు?
ఆస్కార్ అవార్డు అందుకోవడానికి సంగీత దర్శకుడు కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ (Chandra Bose) స్టేజి మీద వెళ్ళారు. అక్కడ అందరూ కీరవాణి ఏం మాట్లాడతారోనని ఆసక్తిగా ఆలకించారు. ఆ సమయంలో స్టేజి వెనుక ఏం జరిగిందో గమనించారా? కీరవాణి వెనుక 'ఆర్ఆర్ఆర్' సినిమాలో ఎన్టీఆర్ ఫోటో డిస్‌ప్లే అయ్యింది. అదీ మెగా ఫ్యాన్స్ కోపానికి కారణమైంది. 


రామ్ చరణ్ ఫోటో ఎక్కడ?
రామ్ చరణ్ ఫోటో ఎందుకు లేదు? - ఇప్పుడీ ప్రశ్న మెగా ఫ్యాన్స్ నుంచి ఆస్కార్స్ (Oscars 2023)కి ఎదురవుతోంది. 'ఆర్ఆర్ఆర్'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ హీరోలు అని, అయితే ఇద్దరిలో ఒక్కరి ఫోటో మాత్రమే స్టేజి మీద ప్రదర్శించడం ఏమిటని మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ అవుతున్నారు. 'నాటు నాటు...'లో కూడా ఇద్దరూ అద్భుతంగా డ్యాన్స్ చేశారని, ఆ విషయం ఆస్కార్ కమిటీ ఎందుకు గుర్తించ లేదని మండిపడుతున్నారు. 


ఆస్కార్ స్టేజి మీద ఎన్టీఆర్ ఫోటో మాత్రమే వేయడం, రామ్ చరణ్ ఫోటో మిస్ కావడం వివాదానికి కారణం అవుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య గొడవలకు దారి తీస్తోంది. ఆస్కార్ వేడుకల్లో హీరోలు ఇద్దరూ కలిసి కనిపించినా... అంతకు ముందు కనిపించకపోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

నిజం చెప్పాలంటే... రామ్ చరణ్ ఫోటో కూడా ఉంది. 'నాటు నాటు...' పాటలో ఎన్టీఆర్ రైట్ సైడ్, రామ్ చరణ్ లెఫ్ట్ సైడ్ డ్యాన్స్ చేశారు. అందువల్ల, స్టేజి మీద కూడా ఫోటోలలో ఆ విధంగా ఉన్నారు. కెమెరా యాంగిల్ వల్ల ఎన్టీఆర్ ఒక్కరే పెద్దగా కనబడ్డారు. కింద ఫోటో చూస్తే... రామ్ చరణ్ కూడా కనిపిస్తారు. 


ఎన్టీఆర్... రామ్ చరణ్...
ఫోటోలు ఎందుకు రాలేదు?
ఆస్కార్ అవార్డ్స్ కోసం రామ్ చరణ్ ముందుగా అమెరికా వెళ్లారు. ఆయన తర్వాత ఎన్టీఆర్ వెళ్ళారు. అయితే... ఇద్దరూ కలిసిన ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. South Asian Excellence at the Oscars పేరుతో ఆస్కార్స్ కంటే ముందు ఓ పార్టీ జరిగింది. దానికి ఆస్కార్ అవార్డుల్లో నామినేషన్స్ అందుకున్న సెలబ్రిటీలు, ఆయా సినిమా యూనిట్ సభ్యులు అటెండ్ అయ్యారు. అయితే...  ప్రియాంకతో ఎన్టీఆర్ ఫోటోలు దిగారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు సైతం ఫోటోలు దిగారు. అయితే... ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ ఫోటో మాత్రం బయటకు రాలేదు. 


Also Read : ఇదీ అసలైన 'నాటు నాటు' మూమెంట్ - ఆస్కార్స్‌లో స్టాండింగ్ ఒవేషన్


ఉపాసన పోస్ట్ చేసిన ఫొటోల్లోనూ...
ఆస్కార్స్ వేడుక దగ్గర దిగిన ఫోటోలను ఉపాసన పోస్ట్ చేశారు. వాటిలోనూ ఎక్కడా ఎన్టీఆర్ లేరు. 'ఆర్ఆర్ఆర్' సినిమా అఫీషియల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన ఒక్క ఫొటోలో మాత్రమే రాజమౌళితో ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించారు. దాంతో హీరోలు ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, అటువంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే... ఆస్కార్ వేడుకలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి సందడి చేశారు. ఓ హాలీవుడ్ మీడియాతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. ఇద్దరూ హాగ్ చేసుకున్నారు. 


Also Read : 'నాటు నాటు'కు ఆస్కార్ - సరికొత్త చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'