ఇదీ అసలైన 'నాటు నాటు...' (Naatu Naatu Song) మూమెంట్ అంటే! ఆస్కార్ అవార్డ్స్ (Oscar Awards 2023) లో మన తెలుగు పాట మారు మోగింది. ప్రపంచ సినిమా వేదిక మీద మన పాటకు అరుదైన గౌరవం, గుర్తింపు లభించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే... 


దీపికా పదుకోన్ ఇంట్రడక్షన్
ఆస్కార్స్ వేదిక మీద 'నాటు నాటు...' సాంగ్ లైవ్ పెర్ఫార్మన్స్ ఉంటుందని ద అకాడమీ అవార్డ్స్ సంస్థ కొన్ని రోజుల క్రితమే వెల్లడించింది. అయితే... వేదికపై ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ సాంగ్ లైవ్ పెర్ఫార్మన్స్ ముందు ఎవరు ఇంట్రడక్షన్ ఇచ్చారో తెలుసా? ఇండియన్ హీరోయిన్ దీపికా పదుకోన్ (Deepika Padukone). 


'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి... అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ గురించి... 'నాటు నాటు' పాట గురించి దీపికా పదుకోన్ గొప్పగా చెప్పారు. 'నాటు నాటు' పాటకు థియేటర్లలో ప్రేక్షకులు అందరూ డ్యాన్స్ చేశారని చెప్పారు. 


స్టేజి మీద 'నాటు నాటు...'
సింగర్స్ ఆస్కార్స్ స్టేజి మీద సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ 'నాటు నాటు...' పాడారు. వాళ్ళు పాడుతుంటే... ఫారినర్స్ డ్యాన్స్ చేశారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. వాళ్ళు డ్యాన్స్ బాగా చేశారు. స్టేజి మీద కీరవాణి వస్తారని కొందరు అభిమానులు ఆశించారు. అయితే... ఆయన స్టేజి మీదకు రాలేదు. తాను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ లైవ్ పెర్ఫార్మన్స్ చేసే అవకాశం లేదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పష్టం చేశారు. 


నిలబడి మరీ చప్పట్లు కొట్టారు
ఆస్కార్స్ స్టేజి మీద కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడటం ఒక ఎత్తు అయితే... వాళ్ళ పెర్ఫార్మన్స్ కంప్లీట్ అయ్యాక ఆడిటోరియంలో ఉన్న ప్రముఖులు అంతా నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. ఒక రెండు నిమిషాలు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. తెలుగు పాటకు, భారతీయ పాటకు దక్కిన గౌరవంగా దీనిని మనం చూడాలి. రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)ను రాజమౌళి గ్రీట్ చేశారు. 


'నాటు నాటు...' పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా... ఎంఎం కీరవాణి స్వరపరచిన గీతమిది. ఈ పాటలో ఎన్టీఆర్ లిరిక్స్ కీరవాణి తనయుడు కాల భైరవ పాడగా... రామ్ చరణ్ లిరిక్స్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇప్పుడు మనం చూస్తున్న స్టెప్ కోసం ప్రేమ్ రక్షిత్ వంద స్టెప్పులు కంపోజ్ చేశారని రాజమౌళి తెలిపారు.


Also Read : ఎన్టీఆర్ షేర్వాణీపై పులి బొమ్మ వెనుక సీక్రెట్ - 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్‌పై కామెంట్






ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా 'నాటు నాటు...' పాటకు అభిమాని. అమెరికాలో రాజమౌళిని కలిసిన ఆయన ఆ విషయం చెప్పడంతో 'దేవుడికి నాటు నాటు నచ్చింది' అని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ తదితరులు నటించారు. డీవీవీ దానయ్య సినిమాను నిర్మించారు. 


Also Read : ఆస్కార్స్‌లో బోణీ కొట్టిన ఇండియా - 'ద ఎలిఫెంట్ విష్పరర్స్'కు అవార్డు