'అన్‌స్టాపబుల్' అంటే తెలుగు ప్రేక్షకులకు నట సింహం నందమూరి బాలకృష్ణ గుర్తొస్తారు. ఆహా ఓటీటీలో ప్రసారమైన ఆ టాక్ షోలో బాలకృష్ణలో సరదా కోణాన్ని ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు ఆ టాక్ షో టైటిల్‌తో ఒక సినిమా రూపొందుతోంది. అందులో 'బిగ్ బాస్' సీజన్ 5 విన్నర్ సన్నీ (Bigg Boss Sunny) హీరో.
'బిగ్ బాస్' సన్నీ కథానాయకుడిగా 'సన్ ఆఫ్ ఇండియా' దర్శకుడు 'డైమండ్' రత్నబాబు ఒక సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఏబీ2 ప్రొడక్షన్స్ పతాకంపై రజిత్ రావు .బి నిర్మిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం అయ్యింది. అలాగే, సన్నీ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. సినిమాకు 'అన్‌స్టాపబుల్' టైటిల్ ఖరారు చేసినట్టు వెల్లడించారు. 'నో డౌట్... 100 పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్' అనేది కాప్షన్.
'సీమ శాస్త్రి', 'పిల్లా నువ్వు లేని జీవితం', 'ఈడో రకం ఆడో రకం' వంటి హిట్ సినిమాలకు 'డైమండ్' రత్నబాబు సంభాషణలు అందించారు. కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాకు దర్శకత్వం వహించారు. సన్నీతో ఆయన సినిమా చేస్తుండటం విశేషం. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నామని దర్శక - నిర్మాతలు తెలిపారు.
Also Read: విజయ్ దేవరకొండతో పూజా హెగ్డే - ముంబైలో ములాఖత్, షూటింగ్ ఫిక్స్ చేసిన పూరి
Also Read: 'సుడిగాలి' సుధీర్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన రష్మీ, ఇద్దరూ అనుకుని చేశారా?