రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా 'జన గణ మణ'. 'లైగర్' విడుదలకు ముందే మరో సినిమాను వీళ్ళిద్దరూ సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. ఇందులో కథానాయికగా తొలుత చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే, పాన్ ఇండియా హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కు విజయ్ అండ్ పూరి ఓటు వేశారు.


'జన గణ మణ' (Jana Gana Mana - JGM movie)లో విజయ్ దేవరకొండకు జంటగా నటించే హీరోయిన్ పూజా హెగ్డేనే. అందులో నో డౌట్. ఈ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేయనున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిలో ఎంత మాత్రం నిజం లేదని సినిమా టీమ్ చెబుతోంది. జూన్ తొలి వారంలో 'జన గణ మణ' షూటింగులో పూజా హెగ్డే జాయిన్ అవుతుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ముంబైలో విజయ్ దేవరకొండ, పూజా హెగ్డేపై సన్నివేశాలు తెరకెక్కించడానికి పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు.


ప్రస్తుతం పూజా హెగ్డే ముంబైలో ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటిస్తున్న 'కబీ ఈద్ కబీ దివాలి' షూటింగ్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత 'జన గణ మణ' షూటింగ్ స్టార్ట్ చేస్తారు. వచ్చే ఏడాది ఆగస్టు 3న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'జన గణ మణ' విడుదల  కానుంది.


Also Read: 'సుడిగాలి' సుధీర్ ప్లేస్‌ను రీప్లేస్ చేసిన రష్మీ, ఇద్దరూ అనుకుని చేశారా?
 
'జన గణ మణ' కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందనున్న తాజా సినిమాలో పూజా హెగ్డే నటించనున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ సినిమా 'భవదీయుడు భగత్ సింగ్'లో కూడా పూజా హెగ్డే హీరోయిన్. అయితే, ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.


Also Read: నయనతార - విఘ్నేష్ శివన్ పెళ్లికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పర్మిషన్ ఇవ్వలేదట!