ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబీ'(Baby) సినిమా రీసెంట్ టైమ్స్​లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ నిర్మాత SKN పేర్లు ఇండస్ట్రీలో మార్మోగిపోయాయి. ముఖ్యంగా సాయి రాజేష్ కి దర్శకుడిగా ఈ చిత్రంతో భారీ గుర్తింపు వచ్చింది. బేబీకి ఈ రేంజ్ సక్సెస్ వస్తుందని సాయి రాజేష్ కూడా ఊహించి ఉండడేమో. అంతలా ఈ సినిమాని ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు సాయి రాజేష్ ప్రొడ్యూసర్ SKN కొత్త సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరో సంతోష్ శోభన్​తో ఓ సినిమాను ప్రారంభించారు.


ఈ సినిమాతో బిగ్ బాస్ దేత్తడి హారిక హీరోయిన్ గా పరిచయం అవుతుంది. సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటూ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సోమవారం ఉదయం హైదరాబాదులో ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అక్కినేని నాగచైతన్య ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా హాజరై మూవీ టీంకి బెస్ట్ విషెస్ అందజేశారు. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్ మీడియాతో మాట్లాడుతూ తమ తదుపరి ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


" అమృత ప్రొడక్షన్స్​లో నేను మూడు సినిమాలు తీశాను. అందులో లాస్ట్ ఫిలిం కలర్ ఫోటో. ఆ మూవీకి బెస్ట్ పిక్చర్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత నేను ప్రొడ్యూస్ చేయలేదు. ప్రాపర్ గా ఓ మంచి కథ అనిపించినప్పుడే ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నాను. ఏదో పెద్ద సక్సెస్ వచ్చింది కదా అని వెంటనే ఏ ప్రాజెక్టు ప్రొడ్యూస్ చేయలేదు. చాలా రోజుల తర్వాత మళ్లీ నాకు ఆ ఎక్సైట్మెంట్ వచ్చింది. బేబీ తర్వాత ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలననే రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది" అని అన్నారు.


ఈరోజు స్టార్ట్ చేసిన మూవీ కూడా వన్ మోర్ లవ్ స్టోరీనే. సోషల్ మీడియాలో ఎన్ని తీస్తార్రా లవ్ స్టోరీలు? అన్నీ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు? అని జనాలు మళ్ళీ మళ్ళీ చెప్పక ముందే నేనే చెప్తున్నాను. నాది, SKN కాంబినేషన్లో మొత్తం ఆరు ప్రేమ కథలు వస్తాయి. దాంట్లో ఇప్పటికే 'కలర్ ఫోటో', 'బేబీ' రెండు మీరు చూసేసారు. ఇక ఇప్పుడు హారిక, సంతోష్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్, మొన్న ఆనంద్, వైష్ణవి కాంబినేషన్లో మరో మూవీ అనౌన్స్ చేసాం. ఆ రెండు కాకుండా ఇంకో రెండు లవ్ స్టోరీస్ ఉంటాయి" అని తెలిపారు.


ఇదేమీ సినిమాటిక్ యూనివర్సా? లేక లింక్ అయ్యాయా? సీక్వెల్ ఉంటుందా? అని చెప్పడానికి నేనేమీ లోకేష్ కనగరాజ్ కాదు. అది నాకు కూడా తెలుసు. కానీ ఆరు హార్ట్ హిట్టింగ్ లవ్ స్టోరీస్​ని  నేను, SKN కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నాం. అందులో ఈరోజు అనౌన్స్ చేసిన ప్రాజెక్టు కూడా ఒకటి. అందులోనూ నాకు మనసుకి చాలా చాలా దగ్గరైనా కథ ఇది. మేమందరం ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్ కోసం చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలని కంకణం కట్టుకుని మరి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా తీస్తాము" అని చెప్పుకొచ్చాడు సాయి రాజేష్.


Also Read : చూస్తారుగా, మనోజ్ మంచు ఆడించే ఆట - వస్తూనే బాక్స్ బద్దలగొట్టిన రాకింగ్ స్టార్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial