దీపావళి సందర్భంగా ఈటీవీలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' పేరుతో స్పెషల్ ఈవెంట్ ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంతో.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మంచు మనోజ్. తాజాగా అందుకు సంబంధించిన ప్రోమోను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. "సింపుల్ తెలుగు బట్ నో కన్ఫ్యూజన్. వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది.. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్. ఈ దివాళి ఈవెంట్ లో అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్" ఉంటుందంటూ హైపర్ ఆది ఇంగ్లీష్ లో డైలాగ్ చెప్పి అదరగొట్టేశాడు. ఆ తర్వాత యాంకర్ సుమ, శ్రీముఖి, చమ్మక్ చంద్ర, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల ఎంట్రీలను చూపించారు. అంతేకాకుండా ఈ ఈవెంట్లో సుమ కోసం ఓ స్పెషల్ పర్ఫామెన్స్ కూడా ప్లాన్ చేసినట్లు కనిపించింది.


ఇక చివరగా మంచు మనోజ్ ఎంట్రీని నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. బ్లాక్ కలర్ జీపులో స్టూడియోకు ఎంట్రీ ఇస్తూ స్టేజ్ పై తన స్టైలిష్ ఎంట్రీ తో అదరగొట్టేసాడు మనోజ్. "చూస్తారుగా ఈ దీవాళికి మనోజ్ మంచు ఆడించే ఆట" అని డైలాగ్ చెబుతూ సుత్తి తీసుకొని ఓ బాక్స్ ని బద్దలు కొడతాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ప్రోమోని బట్టి చూస్తే ఈసారి దీపావళి ఈవెంట్ ని మంచి మనోజ్ తో మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఈవెంట్ లో కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్ మెంబర్స్ అంతా సందడి చేశారు. ఈ ప్రోమోలో మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే కూడా కనిపించారు.


మరోవైపు ఈమధ్య పండగ ఈవెంట్స్ ఎక్కువగా స్టార్ మా చానెల్ లో హోస్ట్ చేస్తున్న శ్రీముఖి దీపావళి ఈవెంట్ మాత్రం ఈటీవీలో హోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ దీపావళి ఈవెంట్ ని శ్రీముఖి ముందుండి నడిపించబోతోంది. ఆమెతోపాటు ఎప్పటిలాగే అటు హైపర్ ఆది ఇటు రాంప్రసాద్ మరింత ఎంటర్టైన్మెంట్ ని పంచబోతున్నారు. దీపావళి రోజున ఉదయం ఈటీవీలో ఈ గ్రాండ్ ఈవెంట్ టెలికాస్ట్ కానునట్లు తెలుస్తోంది.


ఇక మంచు మనోజ్ విషయానికొస్తే.. చాలా గ్యాప్ తర్వాత 'వాట్ ద ఫిష్'(What The Fish) అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు మనోజ్ ఓటీటీలో గేమ్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గానే ఆ గేమ్ షో కి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఈటీవీ విన్ ఓటీటీలో మంచు మనోజ్ సరికొత్త గేమ్ త్వరలోనే ప్రసారం కానుంది.


Also Read : ప్రియాంక vs రతిక - ఈ వారం చూసి నామినేషన్ వేయాలట, శోభాకు షాకిచ్చిన అర్జున్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial