‘బిగ్ బాస్’ సీజన్-7లో నామినేషన్స్ పర్వం మొదలైంది. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్ మధ్య వాడివేడి వార్ జరుగుతోంది. నామినేట్ చేయాల్సిన వ్యక్తులను డ్రాగాన్ స్నేక్ ముందు నిలబెట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈసారి హౌస్‌మేట్స్ రతికాను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమో ప్రకారం.. ప్రియాంక ఈ వారం రతిక, భోలేలను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరితో తీవ్ర వాగ్వాదం నెలకొంది. రతికాను నామినేట్ చేస్తూ.. ‘‘నాగ్ సార్‌కు ఏం చెప్పావ్. ఈ వీక్ నేను చూపిస్తా ఆట అన్నావ్. మరి లాస్ట్ వీక్ ఏం చేశావ్’’ అని అడిగింది ప్రియాంక. ఇందుకు రతిక సమాధానమిస్తూ.. ‘‘ఈ వారం చూసి.. అప్పుడు ఆ పాయింట్ రైజ్ చేయాలి’’ అని రతిక సమాధానం ఇచ్చింది. 


గత వారం ఏం చేసినట్లు?


‘బిగ్ బాస్’ హౌస్‌లోకి రెండోసారి వెళ్లేందుకు ఛాన్స్ రావడం అనేది చాలా చాలా అరుదు. కానీ, రతికాకు ఆ ఛాన్స్ దొరికింది. అయితే, ఆమె దాన్ని సద్వినియోగం చేసుకోడానికి ఏ మాత్రం ప్రయత్నించడం లేదనేది.. గత వారం ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది. కేవలం శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ అభిమానులను నమ్ముకుని హౌస్‌లో టైం పాస్ చేయాలనే ప్లాన్‌తోనే వచ్చినట్లు మొదటి రోజే బీబీ వ్యూవర్స్ అర్థం చేసుకున్నారు. గతవారమంతా యావర్ వెంటే నీడలా తిరుగుతూ గతంలో జరిగినవన్నీ తోడుకుంటూ గడిపేసింది. ప్రశాంత్‌తో మళ్లీ స్నేహం చేస్తూ.. తనపై పడిన మచ్చను చరిపేసుకునే ప్రయత్నించి విఫలమైంది. శివాజీ వల్ల ప్రశాంత్ ఆమెను క్షమించానని చెప్పినా.. మనసులో మాత్రం ఆమెను ఇంకా క్షమించలేనట్లే కనిపిస్తోంది. పైగా గతవారం రతికా నామినేషన్స్‌లో కూడా లేదు. దీంతో ఆమె చాలా రిలాక్స్‌గా కనిపించింది. టాస్కులు కూడా శ్రద్ధతో ఆడలేదు. ఈ పాయింట్లే ఇప్పుడు హౌస్‌మేట్స్ ఆమెను నామినేట్ చేసేందుకు అవకాశంగా మారాయని తెలుస్తోంది.


శోభాకు షాకిచ్చిన అర్జున్ 


‘‘మజాగ్.. మజాగ్‌లో మనకు మజాక్. కానీ, బయట చూసేవారికి అది మాజక్ కాదు శోభా’’ అంటూ శోభాను నామినేట్ చేశాడు అర్జున్. దీంతో శోభా అర్జున్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అతడిని తిరిగి నామినేట్ చేసేందుకు సిద్ధమైంది. ‘‘బ్లాక్ కలర్ రెడీగా ఉంచండి బిగ్ బాస్’’ అని అరిచింది. మరోవైపు పల్లవి ప్రశాంత్.. మళ్లీ అమర్‌దీప్‌నే నామినేట్ చేయడానికి ఎంపిక చేసుకున్నాడు. తనను రెండోసారి కెప్టెన్ కాకుండా అడ్డుకుంటున్నారనే కారణంతో ప్రశాంత్ నామినేట్ చేశాడు. ఇందుకు అమర్ దీప్.. ‘‘ఆ ప్లేస్‌లో నువ్వే కాదు. ఇంకా ఎవరు ఉన్నా.. అదే చేసేవాడిని’’ అని తెలిపాడు. ఇక ప్రియాంక కూడా ఇదే విషయంపై భోలేను నామినేట్ చేసింది. ఏ కారణంతో తనని కెప్టెన్సీకి అనర్హురాలినని చెప్పారో చెప్పాలంటూ భోలేను నామినేట్ చేసింది. ‘‘ఇలా అగ్రెసివ్‌గా ఉంటున్నందుకే అలా చేశా’’ అని భోలే సమాధానం ఇచ్చాడు. మొత్తానికి వీరి వార్.. మహా రంజుగా సాగనున్నట్లు తెలుస్తోంది. గత వారంలా రెండు రోజులపాటు సుదీర్ఘంగా సాగితే మాత్రమే ప్రేక్షకులకు విసుగురావడం ఖాయం. తాజా ‘బిగ్ బాస్’ నామినేషన్స్ ప్రోమోను ఇక్కడ చూడండి. 


Also Read: వాళ్ల వల్లే నేను మునిగిపోయేలా ఉన్నానన్న అమర్ దీప్ - నేను ఉన్నా, లేకున్నా వాడ్ని ఫైనల్స్​లో చూడాలన్న శివాజీ!