Ayesha Takia: అయేషా టకియా... తెలుగులో చేసింది ఒక సినిమాయే అయినా... చాలామందికి గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసింది. నాగార్జున సరసన ‘సూపర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ బ్యూటీ. ఆ మూవీలో ‘గుచ్చి గుచ్చి చంపమాకు’ పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఆ మూవీలో తన గ్లామర్ షోతో ఎంతోమంది కుర్రాళ్ల మనసు దోచిన ఈ బ్యూటీకి ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. హిందీలో కూడా కొన్ని సినిమాలే చేసింది.. ఈ కాంప్లన్ గర్ల్. సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు టచ్‌లోనే ఉంటోంది అయేషా. అయితే, తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫొటో.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసేంత వరకు తీసుకెళ్లింది. ఇంతకీ ఆమె పోస్ట్ చేసిన ఫొటో ఏమిటీ? నెటిజన్స్ ఎందుకు ఆమెను అంతలా ట్రోల్ చేశారు?
అసలు ఏం జరిగిందంటే?
38 ఏళ్ల అయేషా టాకియా చాలా సినిమాల్లో నటించారు. హిందీ, తెలుగు సినిమాల్లో ఆమె యాక్ట్ చేశారు. తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటిది ఇప్పుడు అయేషా తన ఫొటోను పెట్టడంతో నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 13 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న అయేషా టకియా ఇటీవలే ఇన్ స్టా ద్వారా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నారు. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు చెబుతూ ఆమె ఫొటోలు, పోస్ట్ లు షేర్ చేస్తుంటారు. ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.
తాజాగా అయెషా ఒక ఫొటో షేర్ చేసింది. నీలం రంగు చీర కట్టుకుని లేటెస్ట్ ఫొటో షేర్ చేసింది. దాంట్లో ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది. పలుచని బుగ్గలతో, గుర్తుపట్టలేని విధంగా ఉంది ఆమె. ఆ ఫొటో చూసిన నెటిజనులు.. ఆమెను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. ఆయేషా టకియాలో ఇప్పుడు ఆ అందం లేదు, మేం అస్సలు ఆమెను గుర్తుపట్టలేకపోయాం. అసలు నీకు ఏమైంది? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా? అసలు ఏం జరిగిందని ప్రశ్నల వర్షం కురిపించారు ఆమె మీద. దీంతో వాళ్లకు సమాధానం చెప్పలేక ఆమె తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అయేషా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, అందుకే ఆమె అలా తయారు అయ్యింది అనే వార్తలు కూడా వస్తున్నాయి.
సినిమా కెరీర్..
‘ది వండర్ కార్’, ‘వాంటెడ్’, ‘పాఠశాల’, ‘మోడ్’, ‘యే దిల్ మాంగే మోర్’, ‘క్యాష్’, ‘షాదీ సే పెహ్లే’, ‘షాదీ నంబర్ వన్’, ‘సండే’, తెలుగులో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ తదితర సినిమాల్లో నటించారు అయేషా. ఇక ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో కలిసి వాంటెడ్ సినిమాలో నటించారు. అదే ఆమె చివరి సినిమా. ఇక 2009లో అయేషా వివాహం జరిగింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. పెళ్లయ్యాక సినిమాల్లో నటించడం మానేసిన అయేషా ముంబైలో సెటిల్ అయ్యింది. అయేషా భర్త ఫర్హాన్ వ్యాపారవేత్త. అతను ప్రస్తుతం హోటల్ బిజినెస్ తో రానిస్తున్నాడు.
Also Read: విడుదలకు ముందే శాటిలైట్ డీల్ క్లోజ్... మారుతి నగర్ సుబ్రమణ్యం ఏ టీవీలో వస్తుందంటే?