Manchu Vishnu Letter To CINTAA President: 'క‌ల్కీ 2898AD' సినిమాలో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ పై బాలీవుడ్ క‌మెడియ‌న్ అర్ష‌ద్ వార్సీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి. తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీకి చెందిన చాలామంది, ప్ర‌భాస్ ఫ్యాన్స్ అర్ష‌ద్ చేసిన కామెంట్స్ పై ఫైర్ అయ్యారు. ఆ అంశంపై స్పందించారు మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు పూనమ్ ధిల్లాన్ కి లేఖ రాశారు. అర్షద్ చేసిన కామెంట్స్ క‌రెక్ట్ కాదు అని అన్నారు ఆయ‌న‌. 


లేఖ‌లో ఏముందంటే? 


"తెలుగు సినీ వ‌ర్గాల‌ను ఆందోళ‌న‌కు గురిచేసిన విష‌యాన్ని మీ దృష్టికి తీసుకురావాల‌నే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నాను. ఈ మ‌ధ్య ఒక ఇంట‌ర్వ్యూలో శ్రీ అర్ష‌ద్ వార్సి క‌ల్కీ సినిమా గురించి త‌మ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్ర‌తి వ్య‌క్తికి త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రిచే హ‌క్కు ఉంటుంది. దాన్ని మేము గౌర‌విస్తున్నాము. కానీ, ప్ర‌భాస్ ని ఆయ‌న త‌క్కువ చేసి మాట్లాడ‌టం క‌రెక్ట్ కాదు. అది మంచ‌ది కాదు. ఆయ‌న చేసిన కామెంట్స్ సినీ వ‌ర్గాల్లోని చాలామంది, అభిమానుల మ‌న‌సును క‌ల‌చివేశాయి. వారి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాయి." 


"ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా యుగం. ఏ చిన్న విష‌య‌మైనా విప‌రీతంగా వ్యాప్తి చెందుతుంది. అందుకే, మ‌న‌లాంటి ప‌బ్లిక్ ఫిగ‌ర్స్ ఏదైనా మాట్లాడేముందు ఆలోచించాలి, జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి. మాట‌ల‌కు చాలా శ‌క్తి ఉంటుంది. అది ఇద్ద‌రి మ‌ధ్య బంధాన్ని నిర్మిస్తుంది. బంధాన్ని తెంచేస్తుంది కూడా. అర్ష‌ద్ చేసిన కామెంట్స్ సినీ ప్రేమికుల‌ను, ప్ర‌భాస అభిమానులను ఇబ్బంది పెట్టాయి." 


"సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఐక్య‌త కోసం  CINETAA ఎప్పుడు కృషి చేస్తుంద‌ని ఆశిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ మానుకోవాలని వారికి చెప్తార‌ని విశ్వ‌సిస్తున్నాను. తోటి నటీనటుల గురించి ఇలాంటి కామెంట్స్  చేయకుండా ఉండాల్సిందిగా అర్ష‌ద్ ని కోరుతున్నాము. ప్రాంతీయ‌త‌తో సంబంధం లేకుండా మ‌న తోటి న‌టీన‌టుల‌కు ప్ర‌తి ఒక్క‌రికి గౌర‌వాన్ని ఇవ్వాల‌ని, మ‌న గౌర‌వాన్ని కాపాడుకోవడం చాలా అవ‌స‌రం అని చెప్పారు."



 
"మనమంతా ఒకే కుటుంబంలో భాగమని, సినిమా పట్ల మనకున్న అభిరుచికి కట్టుబడి ఉన్నామని గుర్తుంచుకోవాలి. ఐక్య‌త‌గా ఉంటేనే మ‌న‌కు బ‌లం అని, ఆ బ‌లాన్ని మ‌నం కాపాడుకోవాలి. మా పరిశ్రమ కోసం నిలబడే సామరస్యం , గౌరవాన్ని కొనసాగించడంలో మీ మద్దతు కోసం నేను ఎదురు చూస్తున్నాను" అని అన్నారు మంచు విష్ణు. 


అస‌లు వివాదం ఏంటంటే? 


బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మీద చేసిన అభ్యంతరకర కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. క‌ల్కీ 2898 ఏడి లో ప్రభాస్ క్యారెక్టర్ జోకర్ ను తలపించిందన్నారు. మేకర్స్ అతడిని ఎందుకు అలా చిత్రీకరించారో అర్థం కావట్లేదన్నారు. ఇక ఆ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ యాక్టింగ్, ఆయ‌న క్యారెక్ట‌ర్ అద్భుతం అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అర్ష‌ద్ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ లోని ఎంతోమంది స్పందించారు. అలా అన‌డం త‌ప్పు అని అభిప్రాయ‌డ‌ప‌డ్డారు. 


Also Read: ఓటీటీలోకి వచ్చిన ధనుష్ యాక్షన్ డ్రామా 'రాయన్' - ఆర్ అంటే రివేంజ్, ఓ రేంజ్‌లో ఉంటుంది మరి!