ఆర్ అంటే రాయన్... ఆర్ అంటే రివేంజ్ అంటోంది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సంస్థ. ఆర్ అంటే రికార్డ్స్ అంటున్నారు ధనుష్ అభిమానులు. థియేటర్లలో రికార్డుల దుమ్ము దులిపిన 'రాయన్' సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఏయే భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది? అంటే... 


అమెజాన్ ప్రైమ్... ఐదు భాషల్లో!
'రాయన్' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ తీసుకుంది. తమిళ భాషలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులోనూ డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఇప్పుడు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ డబ్ చేశారు. ఈ ఐదు భాషల్లోనూ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.


Also Read: ప్రభాస్ ఫ్యాన్స్, ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసిన 'కల్కి 2898 ఏడీ' - ఓటీటీలు ఎందుకిలా చేశాయి?






బాక్సాఫీస్ బరిలో 'రాయన్' రికార్డులు!
'రాయన్'తో నటుడిగా, దర్శకుడిగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు... బాక్సాఫీస్ బరిలో రికార్డులు క్రియేట్ చేశారు. సుమారు 100 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 150 కోట్లు కలెక్ట్ చేసింది. యాక్షన్ సీన్లు తీసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.


Also Read: ఆహా ఓటీటీలో చూడాల్సిన బెస్ట్ హారర్ మూవీస్ ఇవే... వీటిని అస్సలు మిస్ కావొద్దు



'రాయన్'లో ధనుష్ తమ్ముళ్లుగా సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, చెల్లెలి పాత్రలో దుషారా విజయన్ నటించారు. సందీప్ కిషన్ జోడిగా అపర్ణా బాలమురళి కనిపించగా... విలన్ రోల్ చేశారు ఎస్.జె. సూర్య. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు బలంగా నిలిచాయి. 



నిర్మాత ఫుల్ ఖుషి... రెండు చెక్కులు!
'రాయన్'ను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా విజయంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యాపీ. దర్శకుడిగా తమ సంస్థలో మరో సినిమా చేయమని ధనుష్‌కు అడ్వాన్స్ ఇచ్చారు. అంతే కాదు... హీరోగా సినిమా చేయమని మరో చెక్ ఇచ్చారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర' సినిమా చేస్తున్నారు ధనుష్. అది అయ్యాక మరొక సినిమా లైనులో పెట్టారు. ఆ తర్వాత సన్ పిక్చర్స్ సినిమాలు చేస్తారేమో. దర్శకుడిగా ధనుష్ నెక్ట్స్ ఎటువంటి సినిమా చేస్తారోనని అభిమానులు ఎదురు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.


Also Readఎంగేజ్‌మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్... ఇంతకీ, ఆ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?