'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ బరిలో రికార్డులు క్రియేట్ చేసింది. వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రెబల్ స్టార్ ప్రభాస్ స్టామినాను మరోసారి చాటి చెప్పింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. వెండితెరపై సినిమా చూడని ప్రేక్షకులు డిజిటల్ తెరపై చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే... థియేటర్లలో సినిమా చూసి ఓటీటీలో మరోసారి చూద్దామని స్ట్రీమింగ్ స్టార్ట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్, ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు. అదీ ఎందుకో తెలుసా?


'కల్కి 2898 ఏడీ'ని ట్రిమ్ చేసిన ఓటీటీలు!
'కల్కి 2898 ఏడీ' సినిమా నిడివి ఎంతో తెలుసు కదా! మూడు గంటలకు ఒక్కటంటే ఒక్క నిమిషం ఎక్కువ. టోటల్ 181 మినిట్స్. మరి, ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా రన్ టైమ్ ఎంతో తెలుసా? 175 నిమిషాలు మాత్రమే. 2.55 గంటల మూవీ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేసిన సినిమాలో ఏకంగా ఆరు నిమిషాలకు కత్తెర వేశాయి ఓటీటీ సంస్థలు. ఆ ఎడిటింగ్ ఎవరు చేశారో? ఎందుకు చేశారో తెలియదు గానీ... థియేటర్లలో సినిమా చూసిన జనాలు ఆ మార్పును గమనించారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


Also Read: రాణి గారి మెడలో మూడు ముళ్లు వేసిన రాజా వారు... కిరణ్ అబ్బవరం పెళ్లి ఫోటోలు



బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'జవాన్' బ్లాక్ బస్టర్ కలెక్షన్లు రాబట్టింది. ఆ సినిమా ఓటీటీకి వచ్చే సరికి థియేటర్ల కోసం విడుదల చేసిన విజువల్స్ కంటే ఒకట్రెండు నిమిషాల ఎక్కువ సన్నివేశాలు యాడ్ చేశారు. ఓటీటీ కోసం డిలీట్ చేసిన సీన్లు యాడ్ చేస్తున్న ఈ రోజుల్లో 'కల్కి 2898 ఏడీ'లో సన్నివేశాలకు కత్తెర వేయడం ఎందుకో మరి! ఆ ఎడిటింగ్ సైతం బాలేదని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఓటీటీ సంస్థల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదీ సంగతి! దర్శకుడు నాగ్ అశ్విన్ దృష్టికి ఈ విషయం వెళ్లిందో? లేదో? అభిమానుల అసంతృప్తిని అర్థం చేసుకుని ఓటీటీలో ఫుల్ వెర్షన్ విడుదల చేయాలని కొంత మంది కోరుతున్నారు.


Also Read: ఎంగేజ్‌మెంట్ చేసుకున్న యంగ్ హీరోయిన్... ఇంతకీ, ఆ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా?