బాక్సాఫీస్ బరిలో రెబల్ స్టార్ పభాస్ స్టామినా ఎంత? ఆయన రేంజ్ ఎటువంటిది? అనేది మరొక్కసారి చూపించిన సినిమా 'కల్కి 2989 ఏడీ'. సుమారు 600 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. థియేటర్లలో ఎంతమంది సినిమా చూశారనేది చెప్పడానికి ఆ కలెక్షన్లు ఒక కొలమానం. థియేటర్లలో 'కల్కి 2989 ఏడీ' సినిమా మిస్సయిన వాళ్లకు ఓ శుభవార్త. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.
రెండు ఓటీటీలలో 'కల్కి 2898 ఏడీ' సినిమా
'కల్కి 2989 ఏడీ' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్, అదే విధంగా అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నాయి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే లాంగ్వేజ్ మరొక ఓటీడీలో స్ట్రీమింగ్ కాదు. మరి ఏ ఓటీటీలో ఏ లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది అంటే...
ప్రైమ్ వీడియోలో నాలుగు భాషల్లో...
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం... సౌత్ లాంగ్వేజెస్ 4 వెర్షన్స్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ తీసుకుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉంటాయి. దక్షిణాది భాషల్లో సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ప్రైమ్ వీడియోకు ఓటు వేయడం మంచిది.
హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో!
కల్కి 2989 ఏడీ హిందీ వెర్షన్స్ హక్కులను మాత్రమే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ తీసుకుంది. ఇండియాలో హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువ మంది. అందువల్ల ఆ ఓటీటీలో కూడా సినిమా చూసే నెటిజనులకు ఎటువంటి లోటు ఉండదని చెప్పాలి.
Also Read: వేట్టయాన్ వర్సెస్ కంగువ... దసరా బరిలో రజనీకాంత్, సూర్య సినిమాకు పోటీగా
ఒక్కరోజు ముందుకు వచ్చిన కల్కి 2989 ఏడీ!నిజం చెప్పాలంటే... 'కల్కి 2989 ఏడీ' సినిమాను తొలుత ఆగస్టు 22వ తేదీ నుంచి, అంటే బుధవారం మిడ్ నైట్ నుంచి స్ట్రీమింగ్ చేయాలని అనుకోలేదు. ఆగస్టు 23వ తేదీన ఓటీటీ వేదికల్లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ఆ తర్వాత ఒక్క రోజు ముందుకు జరిపారు. అది సంగతి!
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2989 ఏడి సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషించారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, సీనియర్ హీరోయిన్ శోభన కీలక పాత్రల్లో కనిపించారు. అతిథి పాత్రల్లో మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ సందడి చేశారు.