'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా విడుదల సమయంలో హుషారుగా ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు హీరో నవీన్ పొలిశెట్టి. ఆ సినిమా విజయం సాధించాక ఏమైపోయాడో ఏమో మళ్లీ కనిపించలేదు. దాంతో 'నవీన్‌కి ఏమైంది' అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. చేతికి కట్టుతో ఆయన కనిపించారు. దాని మీద కామెడీ కూడా చేశారు. 'అవునా అలా అయిందా?' అని అందరూ అనుకుంటుండగా... ఆయనే బయటకు వచ్చాడు, ఏం జరిగిందో వివరంగా చెప్పాడు. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్. ఎలా కోలుకున్నాది వివరంగా చెప్పాడు.
'తెలుగు ఇండియన్ ఐడల్ 3'లో నవీన్ పోలిశెట్టి
ఆహా వేదికగా ప్రసారమవుతున్న సింగింగ్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ మూడో సీజన్‌కి నవీన్ పొలిశెట్టి ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ వారాంతంలో ప్రసారం కానున్న రెండు ఎపిసోడ్లలో నవీన్ సందడి చేయనున్నారు. ఈ క్రమంలో తనకు అయిన గాయం గురించి కూడా మాట్లాడాడు. గాయమైన తన చెయ్యి తిరిగి సాధారణ స్థితికి వస్తుందో లేదోనని ఆందోళన చెందినట్లు నవీన్ చెప్పాడు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
''గత ఆరు నెలలు అత్యంత కష్టంగా గడిచాయి. ఎన్నోసవాళ్లు విసిరాయి. నా చేతికి అయిన గాయం తగ్గుతుందో లేదోనని ఒకానొక సందర్భంలో ఆందోళనకు గురయ్యాను. అయితే ఆ కష్టకాలంలో నాకు ఓదార్పును ఇచ్చింది సంగీతం. మ్యూజిక్ నాకు ఓ థెరపీలా పని చేసింది. ఈ సందర్భంగా మ్యూజిషియన్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా'' అని నవీన్ పొలిశెట్టి తెలిపాడు. ఈ క్రమంలో ఓ పాట కూడా పాడి అలరించాడు.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' తర్వాత అమెరికా వెళ్లిన నవీన్ పోలిశెట్టి ఓ రోడ్డు ప్రమాదం జరిగి గాయాలు అయ్యాయి. తొలుత చిన్నపాటి గాయమే అని వార్తలు వచ్చాయి. అయితే ఇన్ని నెలల అయినా ఇంకా బయటకు ఎందుకు రావడం లేదు అని అభిమానులు, ప్రేక్షకులు అనుకుంటుండగా... తన కుడి చేయి, కాలికి తీవ్ర గాయాలయ్యాయని జూలైలో సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా చెప్పాడు. గాయాల కారణంగా సినిమాలు చేయలేకపోతున్నా అని కూడా చెప్పాడు.
Also Read: బ్లాక్ మెయిల్ చేశారు, సెటిల్‌మెంట్‌కు పిలిచారు... త్వరలో ఆ ఫోన్ నంబర్స్ బయటపెడతా - హేమ సంచలన వీడియో
అంతగా గాయాలతో ఇబ్బందిపడుతున్నా నవీన్ ఎక్కడా దిగాలు అయిపోలేదు. తన ఇబ్బందిని కూడా సినిమాటిక్‌గా చూపిస్తూ... ఆ బాధను మరచిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మొన్నీమధ్య తన పెంపుడు శునకంతో కలసి 'ఒక చేయి అందుబాటులో ఉంటే...' అంటూ కష్టాలను సరదగా చూపించే ప్రయత్నం చేశాడు. ఒక చేయి మాత్రమే ఆఖరికి భోజనం విషయంలో వచ్చే ఇబ్బంది నుండి చప్పట్ల విషయంలో వచ్చే వరకు అన్నీ సినిమాటిక్‌గా సరదాగా చూపించాడు.
''జీవితంలో కష్టాలను నవ్వుతూ ఎదుర్కోవాలి. ఈ క్రమంలో హాస్యమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మీ అందరినీ నవ్వించడం నాకెంతో ఇష్టం. పూర్తిగా కోలుకున్న తర్వాత బిగ్ స్క్రీన్‌పై అందరినీ కలుస్తాను'' అని వీడియోలో చెప్పారు నవీన్ పొలిశెట్టి. ఆ వీడియోకు 'లైఫ్ ఒక జిందగీ అయిపోయింది' అంటూ 'జాతి రత్నాలు' సినిమాలోని ఫన్నీ డైలాగ్‌ను క్యాప్షన్‌గా పెట్టారు.