రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రాల్లో 'వేట్టయాన్' (Vettaiyan Movie) ఒకటి. ఈ సినిమాలో సూపర్ స్టార్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సినిమా విడుదల తేదీ వెల్లడించారు. 


దసరా బరిలో... సూర్య 'కంగువ'కు పోటీగా! 
'వేట్టయాన్'లో సూపర్ పోలీస్ ఆఫీసర్ (Rajinikanth Role In Vettaiyan)గా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నారు. ఈ సినిమాను విజయ దశమి కానుకగా అక్టోబర్ 10న తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు లైకా ప్రొడక్షన్స్ సంస్థ తెలియజేసింది. 


Also Readస్త్రీ 2 రివ్యూ: శ్రద్ధా కపూర్ మళ్లీ వచ్చిందిరోయ్... బాలీవుడ్ హారర్ కామెడీ బ్లాక్ బస్టరేనా? మూవీ ఎలా ఉందంటే?






అక్టోబర్ 10న 'కంగువ'ను థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్టు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ టీమ్ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. ఆ మేరకు పబ్లిసిటీ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ తేదీకి వస్తున్నట్టు రజనీకాంత్ 'వేట్టయాన్' టీమ్ కూడా అనౌన్స్ చేసింది. దాంతో రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ బరిలో పోటీ తప్పదు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ హీరోలు ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోలోగా ఎవరి సినిమా వచ్చినా... ఓపెనింగ్స్, కలెక్షన్స్ కాస్త ఎక్కువ వచ్చేవి. ఇప్పుడు రెండు సినిమాలు షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి.


Also Read'కల్కి 2898 ఏడీ'లో ప్రభాస్ జోకర్‌లా ఉన్నాడు - కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడు!


'వేట్టయాన్' చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం పూర్తి చేశారు. రజనీకాంత్ లాస్ట్ డే షూట్ రోజున టీమ్ అంతా ఆయనకు వీడ్కోలు పలికింది. ఇందులో అమితాబ్, ఫహాద్, రానా వంటి భారీ తారాగణం ఉండటంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 



Vettaiyan Movie Cast And Crew: రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందుతున్న 'వేట్టయాన్'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, కిశోర్, రితికా సింగ్, దుషారా విజయన్, జీఎం సుందర్, రోహిణి, రావు రమేష్, అభిరామి, రమేష్ తిలక్, రక్షణ, సాబుమోన్ అబుసమద్, సుప్రీత్ రెడ్డి తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: కె కధీర్, యాక్షన్ డైరెక్టర్: అన్బరివ్, కూర్పు: ఫిలోమిన్ రాజ్, క్రియేటివ్ డైరెక్టర్: బి కిరుతిక, కళా దర్శకుడు: శక్తి వెంకట్ రాజ్, కాస్ట్యూమ్ డిజైనర్: అను వర్ధన్ - వీర కపూర్ - దినేష్ మనోహరన్ - లిజి ప్రేమన్ - సెల్వం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుబ్రమణియన్ నారాయణన్, హెడ్ అఫ్  లైకా ప్రొడక్షన్స్: జీకేఎం తమిళ కుమరన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, ఛాయాగ్రహణం: ఎస్.ఆర్. కతీర్, నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్, నిర్మాత: సుభాస్కరన్, రచయిత - దర్శకుడు: టీజే జ్ఞానవేల్.